ఓటీటీలో రొమాంటిక్ బోల్డ్ సిరీస్.. కొత్త సీజన్ టీజర్ రిలీజ్ | '3 Roses' Season 2: Eesha Rebba, Raashi Singh, Kushitha Set for OTT Release on Aha | Sakshi
Sakshi News home page

3 Roses S2: బోల్డ్ కంటెంట్ ఇప్పుడు మరో సీజన్‌తో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nov 22 2025 2:42 PM | Updated on Nov 22 2025 2:55 PM

3 Roses Web Series Season 2 Teaser

కరోనా టైంలో పలు తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు నేరుగా ఓటీటీల్లో రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అలాంటి వాటిలో 'త్రీ రోజెస్' ఒకటి. 2021లో ఆహా ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అయింది. బోల్డ్ కంటెంట్, దానికి తోడు రొమాంటిక్ కామెడీతో దీన్ని తీశారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ లీడ్ రోల్స్ చేశారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత రెండో సీజన్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది.

(ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ)

వచ్చే నెల 12 నుంచి ఆహా ఓటీటీలో '3 రోజెస్' రెండో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ లాంచ్ చేశారు. ఈసారి కూడా ఈషా రెబ్బా ఉండగా.. పాయల్, పూర్ణకి బదులు రాశి సింగ్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కుషిత కొత్తగా వచ్చి చేరారు. టీజర్‌లో అయితే అడల్ట్ టచ్ ఉన్న జోక్స్, సీన్స్ కనిపించాయి. సిరీస్‌లోనూ వీటితో పాటు రొమాంటిక్ కామెడీ ఉండనుంది. 

(ఇదీ చదవండి: మనసు దోచేస్తున్న 'రాంబాయి'.. ఇంతకీ ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement