కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్లు జరగవు.. హీరోయిన్ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) పరిస్థితి కూడా ఇదే! బెంగళూర్‌కు చెందిన ఈ మూడు పదుల భామ 2019లో మాతృభాష (కన్నడం)లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత టాలీవుడ్‌పై బ్యూటీ దృష్టి పడింది. అలా నాని గ్యాంగ్‌లీడర్ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ చిత్రం విజయంతో శ్రీకారం అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ, ఈ మూవీ నిరాశ పరిచింది.
బ్రేక్
అయినా ప్రియాంక మోహన్‌ను లక్కు వదలలేదు. వెంటనే శివకార్తికేయన్‌కు జంటగా డాక్టర్ అనే చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం హిట్ అవ్వడంతో అదే హీరోతో డాన్ అనే మరో చిత్రం చేసింది. అది సూపర్‌హిట్ అయ్యింది. ఆ తరువాతనే బ్రేక్ పడింది. సూర్యకు జంటగా నటించిన ఎదర్కుం తునిందవన్ చిత్రం నిరాశ పరచింది. ఆ తరువాత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడికి తెలుగులో సరిపోదా శనివారం చిత్రం విజయం కాస్త ఊరటనిచ్చింది.
ఉపయోగపడని ఓజీ
పవన్‌కల్యాణ్‌కు జంటగా ఓజీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ వస్తుందని తెగ సంబరపడిపోయిందనే చెప్పాలి. అయితే ఆ చిత్రం హిట్ అనిపించుకున్నా, ప్రియాంక మోహన్ కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. అంతే కాదు తెలుగులో ఇప్పటి వరకూ మరో అవకాశం రాలేదు. తమిళంలో జయంరవికి జంటగా నటించిన బ్రదర్ చిత్రం బోల్తా పడింది. ఆ తరువాత నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రంలో గోల్డెన్ స్పారో అనే ప్రత్యేక పాటలో యాక్ట్ చేసింది. ఆ చిత్రం ఈమె కెరీర్‌కు ఉపయోగపడలేదు.
ఈ సినిమాలపైనే ఆశలు
కాగా ప్రస్తుతం కెవిన్‌కు జంటగా ఒక చిత్రం, మేడ్ ఇన్ కొరియా అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. వీటిలో ఏదైనా హిట్ అయితేనే ప్రియాంకమోహన్‌కు మరిన్ని అవకాశాలు వస్తాయనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. కాగా సుమారు ఐదేళ్ల తరువాత మాతృభాషలో నటించే అవకాశం ఆ బ్యూటీని వరించింది. ఇలా తమిళం, తెలుగు, కన్నడం, భాషల్లో గత ఆరేళ్లుగా నటిస్తున్నా ఇంకా స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతోంది.


