ఆంధ్రావాలా వస్తున్నాడు | Jr NTR Andhrawala Movie Re Release In Theater | Sakshi
Sakshi News home page

ఆంధ్రావాలా వస్తున్నాడు

Jan 13 2026 3:39 AM | Updated on Jan 13 2026 3:39 AM

Jr NTR Andhrawala Movie Re Release In Theater

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో రీ రిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్‌ హీరోల సినిమాలను మరోసారి రీ రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ అమితాసక్తి చూపుతున్నారు. కొన్ని సినిమాలు రీ రిలీజ్‌లోనూ  ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు మంచి వసూళ్లతో సత్తా చాటుతుండటం విశేషం. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘ఆంధ్రావాలా’(Andhrawala) సినిమా రీ రిలీజ్‌కు ముస్తాబవుతోంది.

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఆంధ్రావాలా’. రక్షిత హీరోయిన్‌. భారతి సమర్పణలో గిరి నిర్మించిన ఈ సినిమా 2004 జనవరి 1న విడుదలైంది. ఈ చిత్రం విడుదలై 22 ఏళ్లు దాటింది. ఈ సందర్భంగా ఈ నెల 26న రీ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత గిరి. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్‌ ప్రస్తుం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎన్టీఆర్‌నీల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) షూట్‌లో పాల్గొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement