‘రాజాసాబ్’ సినిమా విడుదలైన తర్వాత హీరో ప్రభాస్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ఈ విమర్శలకు కారణం సినిమాలో బాడీ డబుల్‌ను అధికంగా వాడారనే భావన ప్రేక్షకుల్లో కలగడమే. ప్రభాస్ సీన్లలో ఎక్కువగా హెడ్ రీప్లేస్‌మెంట్ టెక్నిక్ ఉపయోగించి బాడీ డబుల్‌తో చిత్రీకరించారని ప్రేక్షకులు అంటున్నారు. దీంతో ఆయన స్వయంగా యాక్షన్, డ్యాన్స్ సీన్లలో పాల్గొనలేదనే అభిప్రాయం బలపడుతోంది.
అయితే ఇదే సమయంలో విడుదలైన 'మన శంకర వరప్రసాద్' సినిమాలో 70 ఏళ్ల మెగాస్టార్ ప్రతి సీన్‌లోనూ స్వయంగా పాల్గొన్నారు. డ్యాన్స్‌లు, ఫైట్లు అన్నీ ఆయనే చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అవి మరీ అంత క్లిష్టమైన సీన్లు కాకపోయినా, ఒక్క సీన్ కూడా డూప్‌కు వదలకుండా మెగాస్టార్ స్వయంగా చేశారని ప్రేక్షకులు ఆ రెండు సినిమాలను పోలుస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
70 ఏళ్ల చిరంజీవి ఒక్క సీన్ కూడా డూప్‌కు వదలకుండా చేస్తే మరి 40 ఏళ్లు దాటిన ప్రభాస్ మాత్రం ఎందుకు చేయలేకపోతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలకు ఫ్యాన్స్ కూడా బలంగా సమాధానం చెప్పలేకపోతున్నారు. కారణం ‘రాజాసాబ్’లో టెక్నికల్ లోపాలు లేదా నిర్లక్ష్యం వల్లనో కానీ హెడ్ రీప్లేస్‌మెంట్ షాట్లు స్పష్టంగా కనిపించడం సినిమా చూసిన ప్రేక్షకులకు తెలిసిపోవడమే.


