ET Movie Twitter Review In Telugu, Suriya, Priyanka Arul Mohan - Sakshi
Sakshi News home page

ET Movie Twitter Review: సూర్య `ఈటీ` మూవీ టాక్ ఎలా ఉందంటే..

Mar 10 2022 8:52 AM | Updated on Mar 10 2022 10:07 AM

ET Movie Twitter Review In Telugu - Sakshi

హీరో సూర్య వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్తున్నాడు. ఆయ‌న హీరోగా న‌టించిన‌ `ఆకాశం నీ హద్దురా`, `జై భీమ్‌` ఘ‌న విజ‌యం సాధించాయి. అయితే ఈ రెండు చిత్రాలు కరోనా కార‌ణంగా ఓటీటీలోనే విడుద‌ల‌య్యాయి. దాదాపు మూడేళ్ల తర్వాత సూర్య థియేటర్‌కి వస్తున్న చిత్రం `ఈటీ`(ఎవరికి తలవంచడు). పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటించింది.

సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.  భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ గురువారం (మార్చి 10) ఈటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. . ఇప్పటికే  పలు చోట్ల ప్రీమియర్‌ షోస్‌ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ట్విట‌ర్  వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. అవేంటో చూద్దాం.

ఫస్టాఫ్‌ మాస్‌ జాతరే అంటున్నారు. ఇంటర్వెల్‌ సీన్‌ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. ఇక సెకండాఫ్‌ డీసెంట్‌గా సాగుతుందట. 2022లో ఫస్ట్ రియల్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే అని పేర్కొంటున్నారు. అలాగే సినిమాలో మహిళలకు సంబంధించిన అంశాలు చాలా బాగున్నాయని, పర్‌ఫెక్ట్ ఉమెన్స్ డే గిఫ్ట్ అంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement