Suriya: చాలా గ్యాప్‌ తర్వాత తెలుగు ఫ్యాన్స్‌ కోసం సూర్య సర్‌ప్రైజ్‌

Suriya Telugu Dubbing For The First Time - Sakshi

Suriya Telugu Dubbing For The First Time: తమిళ స్టార్‌ హీరో సూర్యకు టాలీవుడ్‌లోనూ మాంచి డిమాండ్‌ ఉంది. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ మంచి కలెక్షన్లు సాధిస్తుంటాయి. తాజాగా సూర్య ఈటీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాండీరాజ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై హైప్‌ను క్రియేట్‌ చేస్తుంది. అయితే తాజాగా సూర్య ఈ సినిమా కోసం తెలుగులో డబ్బింగ్‌ చెప్పడం విశేషం. గతంలో బ్రదర్స్‌ సినిమా కోసం తొలిసారిగా డబ్బింగ్‌ చెప్పిన సూర్య మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రం డబ్బింగ్‌ చెప్పుకోవడం విశేషం.ఈ సినిమా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top