
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 76వ జయంతి సందర్భంగా మంగళవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఆ మరపురాని మహానేతకు నివాళులర్పించి.. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.



























