కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్.. బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల 2021లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ జంటకు పాప జన్మించింది.
పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత వీరి బిడ్డ పుట్టింది.
అయితే తాజాగా వీరి కుమార్తెకు నామకరణ వేడుక నిర్వహించారు.
బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ హాజరై పేరు పెట్టారు.
ఈ సందర్భంగా గుత్తా జ్వాలా ఎమోషనల్ అయ్యారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.


