breaking news
Gutta Jwala
-
హీరో కుమార్తెకు పేరు పెట్టిన అమిర్ ఖాన్..!
కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్.. బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఈ ఏడాది ఏప్రిల్‌లో పాప జన్మించింది. 2021లో ఈ జంట పెళ్లి చేసుకోగా.. నాలుగేళ్ల తర్వాత వీరి బిడ్డ పుట్టింది. అయితే తాజాగా వీళ్ల ఇంటికి బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ విచ్చేశారు. అంతేకాకుండా ఈ జంట జన్మించిన చిన్నారికి పేరు కూడా పెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు హీరో విష్ణు విశాల్.ఈ సందర్భంగా తమ కుమార్తెకు పేరు పెట్టినందుకు అమిర్ ఖాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మా మైరాని పరిచయం చేస్తున్నాను... మా బిడ్డకు పేరు పెట్టడానికి హైదరాబాద్ వచ్చినందుకు అమిర్ ఖాన్ సార్‌కు కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు బ్యూటీఫుల్ నేమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ఎఫ్ఐఆర్, లాల్ సలామ్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మరోవైపు అమిర్ ఖాన్ సితారే జమీన్ పర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే గతంలో.. తన తల్లికి చికిత్స చేయించే క్రమంలో ఆమిర్.. విష్ణు విశాల్ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నట్టు కోలీవుడ్‌లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vishnu Vishal (@thevishnuvishal) -
వైరలవుతున్న గుత్తా జ్వాల పెళ్లి ఫొటోలు
-
ఇతడే నా వేలంటైన్
వేలంటైన్స్ డే సందర్భంగా ఓ సందేహాన్ని క్లియర్ చేశారు బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల. తమిళ నటుడు విష్ణు విశాల్, గుత్తా జ్వాల కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకరి బర్త్‌డేలు ఒకరు సెలబ్రేట్ చేసుకోవడం, సోషల్ మీడియాలో సెల్ఫీలు పోస్ట్ చేయడంతో వీళ్లు ప్రేమలో ఉన్నారా? అనే సందేహాలు ఏర్పడ్డాయి. వేలంటైన్స్ డే రోజున విష్ణు విశాల్‌కు ముద్దిస్తున్న ఫొటోను పోస్ట్ చేసి ‘ఇతడే నా వేలంటైన్’ అని రాశారు జ్వాల. 2011లో భర్త చేతన్ ఆనంద్ నుంచి గుత్తా జ్వాల, 2018లో భార్య రజనీ నటరాజ్ నుంచి విష్ణు విశాల్ విడిపోయారు. మరి.. ప్రస్తుతం ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో. -
మా ఓట్లు కాకులెత్తుకెళ్లాయా?
సాక్షి,సిటీబ్యూరో : ‘ఓటు వేయాలని వస్తే లిస్ట్‌లో పేరు లేదని చెబుతారా? పేర్లెందుకు లేవు? వాటినేమైనా కాకులు ఎత్తుకెళ్లాయా?’ అని పలువురు ఎన్నికల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చే శారు. శుక్రవారం నగర వ్యాప్తంగా వేలాదిమంది తమ ఓట్లు గల్లంతయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంలో ఒకరి పేరుంటే.. మరొకరి పేరు ఉండదు. మరీ విచిత్రమేమంటే ఓ పాడుబడ్డ ఇంట్లో 65 ఓట్లున్నాయి. సాధారణ ఓటర్లతో పాటు సెలబెట్రీల ఓట్లు కూడా గల్లంతయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజక వర్గాల్లో పెద్ద ఎత్తున ఓట్లు మాయమయ్యాయి. గుత్తాజ్వాల అసహనం ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఓటు గల్లంతైంది. ఆమెతో పాటు కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతయ్యారు. ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు శుక్రవారం ఉదయం ఆమె పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ జాబితాలో తన పేరు కన్పించకపోవడంతో ట్విటర్ వేదికగా అసహనాన్ని వెళ్లగక్కారు. ‘ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు నా పేరు ఉంది. ఓటర్ల జాబితాలో పేరు కన్పించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా జాబితాలో ఓటర్ల పేర్లు లేనప్పుడు ఎన్నికలు ఎలా పారదర్శకంగా జరుగుతాయి’ అని ప్రశ్నించారు. పాతబస్తీలో.. పాతబస్తీ నియోజకవర్గాల్లో పెద్దఎత్తున ఓట్లు గల్లంతయ్యాయి. పలు నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. ∙కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓ ల్యాబ్ క్వార్టర్స్ సంబంధించి ఓట్లు పెద్ద ఎత్తున గల్లంతయ్యాయి. దీంతో ఓటర్లు కేంద్రీయ విద్యాలయం కమ్యూనిటీ హల్లోని పోలింగ్ బూత్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ∙అంబర్‌పేటలోని మన్సూరాబాద్‌లో ఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతయ్యాయి. పలువురు ఓటర్లు పొలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు లేదని అధికారులు తెలుపడతంతో ఆగ్రహంతో ఓటర్లు మండిపడ్డారు. ∙గోషామహాల్ నియోజకవర్గంలోని జాంబాగ్ డివిజన్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లందు కావడంతో తీవ్ర అగ్రహాం వ్యక్తం చేస్తూ పోలింగ్‌బూత్ వద్ద ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఓల్డ్‌బోయినపల్లిలో ఏడు వేల ఓట్లు .. ఓల్డ్ బోయినపల్లి: కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో దాదాపు ఏడు వేల ఓట్లు గల్లంతయ్యాయి. ఓటరు స్లిప్‌లు రాకపోవడంతో తమ ఓటురు కార్డును, అధార్ కార్డులను తీసుకుని పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన వారికి లిస్ట్‌లో వారి పేర్లు లేక వెనుదిరిగారు. ఒక్క మల్కాజిగిరి నియోజకవర్గంలోనే సుమారు 40 వేల ఓట్లు గల్లంతైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈస్ట్ ఆనంద్‌బాగ్, మౌలాలీ, తదితర ప్రాంతాల్లోని 20 కాలనీలకు చెందిన ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. 15వేల ఓట్లు గల్లంతు కావడమంటే కుట్రే.. నేరేడ్మెట్: ఆనంద్‌బాగ్, శివపురి, విష్ణుపురి, విమలాదేవి, చంద్రగిరి కాలనీలతోపాటు ఆర్కే.నగర్ తదితర ప్రాంతాలకు చెందిన ఓటర్లు తమ ఓట్లు గల్లంతు కావడంతో నేరేడ్మెట్లోని భవన్స్ కళాశాల డీఆర్సీకు చేరుకున్నారు. డీఆర్సీ ఎదుట ఓటు వేసే హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఓటు గుర్తింపు కార్డు ఉన్నా..ఓటు హక్కుకు దూరం చేశారని అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. పదులు ..వందలు కాదు..106 నుంచి 113 వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఐదారు కాలనీలకు చెందిన దాదాపు 15వేల ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతు చేశారని విమర్శించారు. పొరపాటు వల్ల ఒక కాలనీలో 10, 20మంది పేర్లు మిస్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం ఓటర్లందరూ గల్లంతు ఎలా అవుతారని వారు ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కుట్ర ఉందని, తమ కాలనీలకు చెందిన పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఓటర్లు డిమాండ్ చేశారు. ఈ విషయమై మల్కాజిగిరి ఎన్నికల అ«ధికారి వేణుగోపాల్‌తో ఓ టర్లు వాదనకు దిగారు. ఎన్నికల అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ ఓటర్ల సవరణ, నమోదు, తొలగింపునకు అనేక సార్లు ప్రకటనలు చేశామన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి.. వేలమంది ఓటర్ల పేర్లు చేర్చినట్టు వారికి వివరించారు. ఓటర్లు ముందే జాబితాను పరిశీలించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని, మళ్లీ నమోదు చేసుకునేందుకు అ వకాశముండేదన్నారు. ఓటర్ల వివరాలను ఆన్లై న్లో పరిశీలించి అవకాశం కల్పిస్తామని ఆర్ఓ స్ప ష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం త దుపరి చర్యలు తీసుకుంటామని ఆర్ఓ పేర్కొనడంతో ఓటర్లు వెళ్లిపోయారు. -
గుత్తా జిగేల్
శోభాయమానంగా సిల్క్‌మార్క్ పోటీలు సంప్రదాయాలకు పట్టం కట్టి నిర్వహణ నన్నపనేనికి జీవన సాఫల్య పురస్కారం క్రీడాకారిణి గుత్తా జ్వాల, గాయని సునీతలకు అవార్డులు విశాఖ–కల్చరల్ : పట్టుచీరల మిలమిలలు.. అలంకరణల కళకళలు.. హŸయల తళతళలు.. చూపరులను మంత్రముగ్థులను చేసే ముద్ద మందారాల.. స్నిగ్థ సింగారాల సోయగాలు. ఇవీ ‘వైజాగ్ శ్రీమతి సిల్క్ మార్క్’ పోటీల వేదికపై ఆవిష్కతమైన సౌందర్యాల సరాగాలు. సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సాగిన కార్యక్రమంలో విరబూసిన సొగసులే కాదు.. వారి విభిన్న ప్రతిభా విశేషాలు వేదికపై తళుక్కుమన్నాయి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వి–టీమ్ సంస్థ వుడా చిల్డ్రన్స్ థియేటర్లో ఆదివారం రాత్రి నిర్వహించిన మార్వ్లస్ మహిళ–2017 కార్యక్రమంలో భాగంగా జరిగిన పోటీలు అతివల బాహ్య, అంతర్గత సొగసులకు, వ్యక్తిత్వానికి, ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టాయి. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన మహిళలకు ఇచ్చిన పురస్కారాలు వారి సత్తాను చాటాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రారంభించిన ఈ కార్యక్రమం కనులవిందుగా సాగింది. మొదట నన్నపనేని రాజకుమారికి మంత్రి గంటా జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. విభిన్న రంగాలలో స్ఫూర్తి ప్రదాతలైన మహిళలకూ ఆయన పురస్కారాలను అందజేశారు. సుప్రసిద్ద బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలను అత్యంత ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి బిరుదుతో, ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని సునీతను లతామంగేష్కర్ స్వీట్ వాయిస్ అవార్డుతో సత్కరించారు. ముగ్థ మందారాలు వివాహిత మహిళలకు నిర్వహించిన వైజాగ్ శ్రీమతి సిల్క్‌మార్క్ పోటీ నేత్రపర్వంగా సాగింది. గత ఆదివారం వుడా సెంట్రల్ పార్కులో నిర్వహించిన వడపోత ద్వారా 65 మందిని ఎంపిక చేసి వారికి తుది పోటీ నిర్వహించి మళ్లీ 25మందిని ఎంపిక చేశారు. వీరి నుంచి ఫైనల్ విజేతను నిర్ణయించారు. శ్రీమతి వైజాగ్ సిల్క్ మార్క్ విజేతలకు, ఫైనల్లో తలబడిన మహిళలకు నన్నపనేని రాజకుమారి, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ తార జ్వాలా గుత్తా, సినీ నేపథ్య గాయని సునీత, కలెక్టర్ సతీమణి శోభనాస్మతి, వీరుమామ బహుమతులు అందించారు. మెజిషియన్ రవిశంకర్ ఫ్లాష్ యాక్ట్ ప్రతిభ సంభ్రమాశ్చర్యాలు కలిగించింది.