ఇతడే నా వేలంటైన్

వేలంటైన్స్ డే సందర్భంగా ఓ సందేహాన్ని క్లియర్ చేశారు బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల. తమిళ నటుడు విష్ణు విశాల్, గుత్తా జ్వాల కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకరి బర్త్‌డేలు ఒకరు సెలబ్రేట్ చేసుకోవడం, సోషల్ మీడియాలో సెల్ఫీలు పోస్ట్ చేయడంతో వీళ్లు ప్రేమలో ఉన్నారా? అనే సందేహాలు ఏర్పడ్డాయి. వేలంటైన్స్ డే రోజున విష్ణు విశాల్‌కు ముద్దిస్తున్న ఫొటోను పోస్ట్ చేసి ‘ఇతడే నా వేలంటైన్’ అని రాశారు జ్వాల. 2011లో భర్త చేతన్ ఆనంద్ నుంచి గుత్తా జ్వాల, 2018లో భార్య రజనీ నటరాజ్ నుంచి విష్ణు విశాల్ విడిపోయారు. మరి.. ప్రస్తుతం ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి