సూర్యతో బుట్టబొమ్మ స్టెప్పులు.. బుజ్జమ్మ సాంగ్‌ వచ్చేసింది | Suriya and Pooja Hegde Bujjamma Lyrical Video Song from Retro | Sakshi
Sakshi News home page

Retro Movie: సూర్యతో బుట్టబొమ్మ స్టెప్పులు.. బుజ్జమ్మ సాంగ్‌ వచ్చేసింది

Mar 28 2025 8:07 PM | Updated on Mar 28 2025 8:23 PM

Suriya and Pooja Hegde Bujjamma Lyrical Video Song from Retro

సూర్య హీరోగా కార్తిక్‌ సుబ్బరాజ్‌ తెరకెక్కించిన సినిమా ‘రెట్రో’. ఇందులోని హుషారైన గీతాన్ని టీమ్‌ విడుదల చేసింది. ఈ చిత్రాన్ని జ్యోతిక, సూర్యనే నిర్మిస్తున్నారు. ప్రేమ, యుద్ధం నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్.

ఈ చిత్రంలో బుజ్జమ్మ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. సంతోష్ నారాయణన్ ఆలపించారు. ఈ సాంగ్‌ విడుదలైన కొద్ది సేపటికే యూట్యూబ్‌లో దూసుకెళ్లోంది. సూర్య అభిమానులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ చిత్రంలో జోజు జార్జ్, జయరామ్, కరుణాకరన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతమందిస్తుండగా.. మే 1న మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement