స్క్రీన్ పై క్యూట్‌గా మెరిసే ప్రియాంకా అరుల్ మోహన్ , ఆఫ్‌స్క్రీన్ లో మాత్రం సింపుల్, స్మార్ట్ గర్ల్. ఆ మాటలో మాటగా చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం..
⇒ చెన్నైలో పుట్టాను కాని, పెరిగింది అంతా బెంగళూరులోనే. అందుకే నా జీవితంలో ఈ రెండు నగరాల కలయిక ఉంటుంది. నాన్న అరుల్ మోహన్ నుంచి క్రమశిక్షణ, అమ్మ కృష్ణమోహన్ నుంచి ఫ్యాషన్ నేర్చుకున్నాను.
⇒ నా మొదటి సినిమా కన్నడలో ‘ఒంద్ కథె హెళ్లా’. కాని, ప్రేక్షకులు నన్ను నిజంగా గుర్తించింది నానితో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ ద్వారానే. ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ అన్నింట్లోనూ బిజీగా ఉన్నా, ప్రతి పాత్ర నాకు కొత్త ఫీలింగ్ ఇస్తుంది. ‘ఓజీ’లో నటించడం ఒక ప్రత్యేక అనుభవం. అందులోని కణ్మణి పాత్ర నా ఫేవరెట్!
⇒ ఉదయం లేవగానే నా మొదటి మాట ఎప్పుడూ ‘కాఫీ ఉందా?’ అనే. కాఫీ లేకుండా నా రోజు మొదలవదు! ఆ తర్వాత మ్యూజిక్, పుస్తకాలు ఇవే నా మార్నింగ్ మూడ్ సెట్ చేస్తాయి.
⇒ యోగా, డ్యాన్స్ నా ఫిట్‌నెస్ ఫ్రెండ్స్. ఫిట్‌గా ఉండటం అంటే సన్నగా ఉండటం కాదు, హ్యాపీ ఫీలింగ్‌తో ఫైన్ గా ఉండటం.
⇒ సాధారణంగా నేను లైట్ డైట్ ఫాలో అవుతాను ఇడ్లీ, ఓట్స్, సలాడ్, సూప్. కానీ సండే అంటే నా చీట్ డే! అప్పుడే పిజ్జా, ఐస్‌క్రీమ్ తప్పనిసరి! చాక్లెట్ మాత్రం కంట్రోల్‌గా ఒక్క క్యూబ్ మాత్రమే తింటాను.
⇒ నా స్టయిల్ సింపుల్ కానీ క్లాసీ! కాటన్ చీరల్లో కంఫర్ట్, పేస్టెల్ కలర్స్‌లో చిల్, లాంగ్ ఫ్రాక్‌లలో ఫన్ . హై హీల్స్ కంటే వైట్ షూస్ ఇవే నా స్టేట్‌మెంట్ పీస్‌లో ఒకటి. ముఖ సౌందర్యం కోసం నైట్ నిద్రపోయే ముందు అలోవెరా జెల్, ఉదయం లెమన్ వాటర్ తప్పనిసరి.
⇒ హీరో జయం రవితో లింక్‌అప్ రూమర్స్ వచ్చినప్పుడు చాలా నవ్వుకున్నాను! స్క్రీన్ పై కెమిస్ట్రీ ఉంటే చాలు, రియల్ లైఫ్‌లో రూమర్స్ అవసరం లేదు కదా!
⇒ ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ ఏఐ ఫోటోలు వైరల్ అయినప్పుడు నేనే ముందుకు వచ్చి మాట్లాడాను. అలాంటి వాటిని షేర్ చేయకండి, మానవత్వాన్ని కాపాడుకుందాం!
⇒నా దృష్టిలో జీవితం అంటే పెద్ద సినిమా కాదు, చిన్న చిన్న హ్యాపీ సీన్స్ కలెక్షన్ . అందుకే, టైమ్ దొరికినప్పుడల్లా కొత్త ప్రదేశాలను చుట్టేస్తుంటా! సముద్రతీరాల సైలెన్స్, కొండల కూల్‌నెస్ నాకు థెరపీలా పనిచేస్తాయి. స్విట్జర్లాండ్ వింటర్, కేరళ హౌస్‌బోట్ డే.. ఇవే నా డ్రీమ్ వెకేషన్ .


