ఓజీ హీరోయిన్‌ 'ప్రియాంక' ఫోటోలు లీక్‌.. వార్నింగ్‌ ఇచ్చిన నటి | Priyanka Mohan Reacts to Viral AI-Generated Photos | Actress Speaks Out | Sakshi
Sakshi News home page

ఓజీ హీరోయిన్‌ 'ప్రియాంక' ఫోటోలు లీక్‌.. వార్నింగ్‌ ఇచ్చిన నటి

Oct 11 2025 11:34 AM | Updated on Oct 11 2025 11:46 AM

Priyanka Mohan Comments Her AI Generated photos

చెన్నై బ్యూటీ ప్రియాంక మోహన్(Priyanka Mohan) ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తను స్నానానికి వెళ్తున్నప్పుడు తీసుకున్న సెల్ఫీలుగా వైరల్‌ అవుతున్నాయి. బాత్రూమ్‌ ఫోటోలు లీక్‌ అంటూ కొందరు ఫోటోలు షేర్‌ చేశారు. దీంతో తాజాగా ఆమె షోషల్‌ మీడియాలో రియాక్ట్‌ అయింది. రీసెంట్‌గా పవన్‌ కల్యాణ్‌ ఓజీ సినిమాలో ఆయనకు సతీమణిగా ప్రియాంక మోహన్‌ నటించిన విషయం తెలిసిందే.

వాస్తవంగా నెట్టింట వైరల్‌ అవుతున్న ప్రయాంక మోహన్‌ ఫోటోలు అన్నీ కూడా AI క్రియేట్‌ చేసినవే.. కానీ, అవి నిజమైన వాటి మాదిరిగానే ఉండటంతో నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే ఆమె ఇలా స్పందించారు. ఇలాంటి నకిలీ ఫోటోలను వైరల్‌ చేయడం ఇకనైనా ఆపేయండి. నన్ను తప్పుగా చిత్రీకరించే కొన్ని AI-జనరేటెడ్ చిత్రాలు సర్క్యులేట్ అవుతున్నాయి. దయచేసి వీటిని షేర్‌ చేయడం ఆపేయండి. AIని నైతిక సృజనాత్మకత కోసం మాత్రమే ఉపయోగించాలి. ఇలాంటి తప్పుడు సమాచారం కోసం కాదు. మనం ఏమి క్రియేట్‌ చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎలాంటి వాటిని ఇతరులతో పంచుకుంటున్నాం అనేదాని గురించి జాగ్రత్తగా ఉండండి. అందరికీ ధన్యవాదాలు. అంటూ ఆమె షేర్‌ చేసింది.

ఓజీ సినిమాలో ప్రియాంక మోహన్‌, పవన్‌ కల్యాణ్‌ మధ్య సువ్వి.. సువ్వి సాంగ్‌ ఉంటుంది. ఆ పాటలో ఆమె ఇదే కాస్ట్యూమ్‌తో కనిపిస్తుంది. దీనిని ఛాన్స్‌గా తీసుకున్న కొందరు ఏఐ సాయంతో మరింత నీచంగా ఫోటోలు క్రియేట్‌ చేశారు. అవే ఇప్పుడు ప్రియాంకకు ఇబ్బందిగా మారాయి.

 

నెటిజన్లు ప్రియాంక మోహన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ తీరుపై కాస్త ఏకాగ్రత పెట్టాలని సలహాలు ఇస్తున్నారు. ఏఐ సాయంతో  ఇలాంటి ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసేవారిపై తప్పకుండా కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వారి ఆనందం కోసం మరోకరిని బలి చేయడం ఏంటి అంటూ ఫైర్‌ అవుతున్నారు.  నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ (2019) చిత్రం ద్వారా ప్రియాంకా మోహన్ తెలుగు సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత శ్రీకారం, సరిపోదా శనివారం వంటి చిత్రాలతో మెప్పించిన ఈ బ్యూటీ రీసెంట్‌గా ఓజీలో నటించింది. తమిళనాట శివ కార్తికేయన్ హీరోగా డాక్టర్, డాన్ సినిమాల్లో నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement