
పవన్ కల్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జోడీగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌మోహన్ పోషించిన కన్మణి పాత్ర ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. ‘‘ఓజీ’లో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారు.
ప్రతి తు పానుకు అవసరమైన ప్రశాంతత ప్రియాంకా అరుళ్‌మోహన్ కన్మణి పాత్ర. మా సినిమా నుంచి ఇటీవల విడుదలైన మొదటి పాట ‘ఫైర్ స్టార్మ్..’కు విశేష స్పందన లభించింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాశ్‌రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలుపోషిస్తున్న ఈ సినిమాకి సంగీతం ఎస్. తమన్, కెమెరా: రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస.