
ఎన్టీఆర్ బావమరిది, హీరో నార్నే నితిన్ పెళ్లి చేసుకున్నాడు. లక్ష‍్మీ శివాని అనే అమ్మాయితో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని శంకరపల్లిలో ఈ వివాహ వేడుక జరిగింది. అయితే పెళ్లి కొడుకు ఎవరనేది అందరికీ తెలుసు. తారక్ భార్య లక్ష‍్మీ ప్రణతికి సొంత తమ్మడు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, ఆయ్ తదితర చిత్రాలతో హీరోగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు.
మరి పెళ్లి కూతురు ఎవరు ఏంటనేది మాత్రం పెద్దగా తెలియదు. అయితే ఈ పెళ్లిలో హీరో వెంకటేశ్ కుటుంబం కూడా కనిపించడంతో అమ్మాయికి వీళ్లకు బంధుత్వం ఏంటా అని అందరూ అనుకున్నారు. అయితే పెళ్లి కూతురు లక్ష‍్మీ శివానిది నెల్లూరు. కానీ వ్యాపారరీత్యా ఈమె తండ్రి కృష్ణప్రసాద్ హైదరాబాద్‌లో ఉన్నారు. దీంతో లక్ష‍్మీ శివాని.. చదువంతా భాగ్యనగరంలోనే పూర్తి చేసింది. అయితే దగ్గుబాటి కుటుంబంతో వీళ్లకు బంధుత్వం ఉంది. దివంగత రామానాయుడికి ఈమె మనవరాలు అవుతుంది. అంటే వెంకటేశ్, సురేశ్ బాబుకు కూతురు వరస అవుతుంది.
(ఇదీ చదవండి: హీరో రానా నుంచి 'బూతుల' సినిమా.. టీజర్ రిలీజ్)
అందుకే నార్నే నితిన్-శివాని పెళ్లిలో దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన హీరో వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, రానా, నాగచైతన్య తదితరులు సందడి చేశారు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా ఈ వివాహ వేడుకలో కనిపించారు. గతేడాది నవంబరులో నితిన్-శివానిల నిశ్చితార్థం జరగ్గా.. ఇప్పుడు పెళ్లి జరిగింది.
నార్నే నితిన్ విషయానికొస్తే.. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్, శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాలతో వచ్చాడు. ప్రస్తుతానికైతే ఇతడి చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేనట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పెళ్లయింది కాబట్టి కొన్నాళ్ల పాటు ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేసి త్వరలో కొత్త చిత్రాల్ని ప్రకటిస్తాడేమో చూడాలి!
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే)
#Venkatesh & #Rana at Narne Nithin Marriage pic.twitter.com/5XcCBoAtZz
— Taraq(Tarak Ram) (@tarakviews) October 11, 2025
