
రీసెంట్ టైంలో సినిమాల్లో వైల్డ్‌నెస్ పేరిట బూతుల్ని, బూతు సన్నివేశాల్ని అక్కడక్కడ ఉపయోగిస్తున్నారు. కొన్నింటికి సెన్సార్ కత‍్తెర వేస్తున్నప్పటికీ మరికొన్నిసార్లు మాత్రం మూవీకి 'ఏ' సర్టిఫికెట్ లాంటివి తెచ్చుకుని రిలీజ్ చేస్తున్నారు. వీటిని యూత్ చూస్తారు. ఫ్యామిలీ అడియెన్స్ కాస్త దూరంగానే ఉంటారు. సరే ఇదంతా పక్కనబెడితే రానా నిర్మాతగా 'డార్క్ చాక్లెట్' అనే మూవీ త్వరలో రాబోతుంది. దీని టీజర్ ఇప్పుడు రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే)
టీజర్ చూస్తుంటే.. యజ్ఞ అనే హీరో, ఓ ముగ్గురు వ్యక్తుల(ఓ మహిళ, ఇద్దరు పురుషులు) మధ్య జరిగే కథే ఈ సినిమా స్టోరీలా అనిపిస్తుంది. అయితే టీజర్ బూతు సన్నివేశాలేం లేవు గానీ బూతు మాటలు మాత్రం కాస్త గట్టిగానే వినిపించాయి. అయితే వీటిని టీజర్ కోసమే పెట్టారా? నిజంగా మూవీలోనూ ఉంచుతారా అనేది చూడాలి? అయితే హీరో రానా నిర్మాతగా ఈ తరహా మూవీ వస్తుందని అస్సలు ఊహించలేదు.
'35' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వదేవ్ ఇందులో హీరో కాగా బిందుమాధవి హీరోయిన్. మరో ఇద్దరు కూడా తెలుగు నటులే. 'కిడ్స్ పక్కకెళ్లి ఆడుకోండి' ,'పాన్ మసాలా మూవీ', 'జానర్ అడగొద్దు' లాంటి క్యాప్షన్స్ చూస్తుంటే కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అలానే రిలీజ్ ఎప్పుడనేది కూడా అక్టోబరు 31, నవంబరు 14, డిసెంబరు 5 అని మూడు తేదీలు ప్రకటించి, మనల్నే ఎంచుకోమన్నట్లు చూపించారు. శశాంక్ శ్రీ వాస్తవ్య దర్శకుడు కాగా వివేక్ సాగర్ సంగీతమందించాడు. చూస్తుంటే ఇది పెద్దల కోసం మాత్రమే తీసిన సినిమాలా అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: మొన్న విజయ్..నేడు రష్మిక.. అలా బయటపెట్టేశారుగా!)