
ఫ్లోరా సైనీ (Flora Saini).. ఈపాటికే ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్! అలా అని తనపై జనాల్లో అంత వ్యతిరేకత ఉందా? అంటే రవ్వంతైనా లేదు. కానీ, తనపై పాజిటివిటీ కూడా లేదు. హౌస్‌లో ఎటువంటి ఇంపాక్ట్ చూపించకపోవడమే ఫ్లోరాకు పెద్ద మైనస్. అయితే కామనర్స్ చేసిన ఓవరాక్షన్ వల్ల ఫ్లోరాకు ఓట్లు పడ్డాయి. తనను లేటుగానైనా పంపించొచ్చు, ముందు తలనొప్పిగా తయారైన కంటెస్టెంట్లను తరిమేద్దాం అన్న ఉద్దేశంతో మనీష్, ప్రియ, హరీశ్‌లను బయటకు తోసేశారు.
స్కెచ్ వర్కవుట్ అయినట్లేనా?
కానీ, తన వల్ల షోకి ఎటువంటి ప్లస్ లేకపోయేసరికి బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9).. ఫ్లోరా ఎలిమినేషన్‌కు పెద్ద స్కెచ్ వేశాడు. తనను రెండువారాలు డైరెక్ట్‌గా నామినేట్ చేశాడు. పైగా ఈవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు వచ్చేస్తున్నారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా ఆరుగురిని హౌస్‌లో దింపుతున్నారు. కాబట్టి తనతో పనేం లేనందున ఫ్లోరాను హౌస్ నుంచి సాగనంపుతున్నారు.
ఫ్లోరా ఏం చేసింది?
ఫ్లోరా సైలెంట్‌గా తన పని తను చేసుకుంటూ పోతుంది. తిన్నామా, పడుకున్నామా, గేమ్స్ ఆడామా.. అంతే! అంతకుమించి ఎటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం లేదు. సంచాలక్‌గా ఉన్నప్పుడైతే తప్పుల మీద తప్పులు చేస్తోంది. ఎవరైనా తనను నామినేట్ చేసినా, ప్రశ్నించినా సైలెంట్‌గా ఉంటుందే తప్ప తిరిగి కౌంటర్లివ్వడం చాలా అరుదు. ఇలాంటి సైలెంట్ కంటెస్టెంట్ జనాలకు అంతగా నచ్చరు. అందుకే లక్స్ పాప ఈ వారం బయటకు వచ్చేస్తోందన్నమాట!
చదవండి: పగలూరాత్రి తేడా లేకుండా మందు తాగా.. ఆరుగురితో డేటింగ్: బిగ్‌బాస్ కంటెస్టెంట్