
కుటుంబం గురించైనా, వ్యక్తిగత విషయాల గురించైనా కొందరు ఓపెన్‌గా మాట్లాడుతుంటారు. మరికొందరు మాత్రం అన్నీ గోప్యంగానే ఉంచాలనుకుంటారు. బాలీవుడ్ నటి, సింగర్ కునికా సదానంద్ (Kunickaa Sadanand) మొదటి కోవకు చెందుతుంది. దాపరికాల్లేకుండా అన్నీ బాహాటంగానే మాట్లాడుతుంది. ఈమె ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్‌లో పాల్గొంది.
మందుకు బానిసయ్యా
బిగ్‌బాస్ (Bigg Boss Reality Show) హౌస్‌లో తనకున్న చెడు అలవాట్ల గురించి ఓపెన్ అయింది. నేనెప్పుడూ డ్రగ్స్ జోలికి వెళ్లలేదు. కానీ నాకు మందు తాగే అలవాటుంది. బ్రేకప్ అయినప్పుడు మందుకు బానిసయ్యాను. బాధతో ఇంకా ఎక్కువ తాగేసి చాలా బరువు పెరిగిపోయాను. డబ్బింగ్ చెప్పడానికి స్టూడియో వెళ్లినప్పుడు నన్ను నేను అద్దంలో చూసుకుని షాకయ్యాను. నేనిలా అయిపోయానేంటి? అనుకున్నాను. గుండెనిండా బాధతో పగలూరాత్రీ తేడా లేకుండా మద్యం సేవించేదాన్ని. పట్టపగలే బీర్ తాగేదాన్ని.
యాక్టర్స్‌ను ప్రేమించలేదు
రాత్రి క్లబ్‌కు వెళ్లి మళ్లీ మందు తాగుతూ కూర్చునేదాన్ని. మందు తాగడం మానేయ్ అని నాన్న హెచ్చరించినా లెక్క చేయలేదు. రిలేషన్స్ విషయానికి వస్తే.. నేను ఇద్దరితో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. నలుగురితో రొమాన్స్ చేశా.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాను. కానీ యాక్టర్స్‌తో మాత్రం ప్రేమలో పడలేదు. యాక్టర్స్ ఎప్పుడూ అద్దంలో వారి ముఖాన్ని చూసుకుని మురిసిపోతుంటారు. పక్కవాళ్లకంటే ముందు వారినే ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎప్పుడూ అద్దం ముందు ఉండేవాళ్లతో నేనెలా ఉండగలను? అని చెప్పుకొచ్చింది.
పర్సనల్ లైఫ్
కాగా కునికా సదానంద్.. ఢిల్లీకి చెందిన అభయ్ కొటారిని పెళ్లి చేసుకోగా వీరికి ఓ బాబు పుట్టాడు. కానీ, దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 35 ఏళ్ల వయసులో వినయ్ లాల్‌ను పెళ్లి చేసుకోగా.. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. కానీ, ఈ జంట కూడా కలిసుండలేకపోయింది. భార్యాభర్తలిద్దరూ విడిపోయారు.
చదవండి: వాడికి యాక్టింగ్ వద్దు.. కోహ్లి బ్యాట్ కావాలి, రోహిత్..: కరీనా కపూర్