
స్టార్ సెలబ్రిటీల పిల్లలు యాక్టింగ్ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. అలా సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) మొదటి భార్య (అమృత సింగ్) పిల్లలు ఇబ్రహీం అలీ ఖాన్, సారా అలీ ఖాన్ కూడా పేరెంట్స్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. అయితే సైఫ్- కరీనా కపూర్ (Kareena Kapoor) పిల్లలు మాత్రం యాక్టింగ్‌పై అంతగా ఆసక్తి చూపించడం లేదట! ఈ విషయాన్ని కరీనా తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించింది.
యాక్టింగ్ ఇంట్రస్ట్ లేదు
సైఫ్ అలీఖాన్ సోదరి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌కి కరీనా హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తైమూర్‌కు యాక్టింగ్‌పై ఏమాత్రం ఆసక్తి లేదు. డ్రామా క్లాసుల్లో జాయిన్ అవుతావా? అని అడిగితే వాడు నో చెప్పేవాడు. ఒకసారి యాక్టింగ్ ట్రై చేసి చూడు అని అడిగితే.. లేదమ్మా, యాక్టింగ్ నేను ఎంజాయ్ చేయలేను అన్నాడు. అందుకే వాడిని నేను బలవంతం చేయదల్చుకోలేదు.
కోహ్లి బ్యాట్ ఇప్పిస్తావా?
సైప్‌కు వంట చేయడం ఇష్టం. తండ్రిని చూసి వాడు కూడా కుకరీ క్లాస్‌లో జాయిన్ అవుతానన్నాడు. వాడెప్పుడూ నాతోపాటు సెట్స్‌కు రాలేదు. ఏ యాక్టర్‌నూ కలవలేదు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ నీ ఫ్రెండ్సేనా? వాళ్ల బ్యాట్ ఇవ్వమని మెసేజ్ చేస్తావా? లియోనాల్ మెస్సీ ఫోన్ నెంబర్ నీ దగ్గరుందా? ఇలాంటి ప్రశ్నలే అడుగుతుంటాడు. వాళ్లెవరి నెంబర్లూ నా దగ్గర లేవని చెప్పేదాన్ని. వాడికి యాక్టర్స్ గురించి పెద్దగా ఏమీ తెలీదు. ఎంతసేపూ విరాట్‌తో మాట్లాడిస్తావా? అంటూ క్రీడాకారుల గురించే ఆరా తీస్తుంటాడు అని చెప్పుకొచ్చింది.
సైఫ్-కరీనా ఫ్యామిలీ
సైఫ్- కరీనా కపూర్ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2016లో తైమూర్ జన్మించాడు. 2021లో జహంగీర్ పుట్టాడు. సైఫ్ జంట ఎంత పెద్ద సెలబ్రిటీలైనా సరే.. పిల్లల స్కూల్ ఈవెంట్స్‌కు మాత్రం తప్పక హాజరవుతూ ఉంటారు. తైమూర్‌కు స్పోర్ట్స్ అంటేనే ఇష్టం అని కరీనాయే స్వయంగా చెప్తోంది. మరి జహంగీర్ కూడా అన్నలాగే ఆలోచిస్తాడా? పేరెంట్స్ దారిలో పయనిస్తాడా చూడాలి!