
తనూజ అమాయకత్వం, తింగరితనాన్ని బాగా వాడేసుకున్నాడు పవన్ కల్యాణ్. అతడిని సేఫ్ జోన్‌లో పడేయడంతో పాటు కెప్టెన్ అయ్యేందుకు దారులు పరిచింది తనూజ. అదెలాగో నిన్నటి (అక్టోబర్ 10వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
పూల్ టాస్క్
కల్యాణ్ (Pawan Kalyan Padala)ను ఎందుకు సేఫ్ జోన్‌లోకి పంపించావు, తనకంటే నువ్వే బాగా ఆడావు కదా! అని ఇమ్మాన్యుయేల్, దివ్య అడిగారు. అందుకు తనూజ.. మేము జట్టు కట్టేటప్పుడే సేఫ్ అవడంలాంటివి వస్తే తనే తీసుకుంటానన్నాడు. అప్పుడే మాటిచ్చాను అని చెప్పడంతో ఇమ్మూ-దివ్య నోరెళ్లబెట్టారు. ఇక డేంజర్ జోన్‌లో ఉన్నవారిలో ఒకర్ని సేఫ్ జోన్‌కు పంపించేందుకు బిగ్‌బాస్ చివరి ఛాన్స్‌గా పూల్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అందరికంటే పవన్ బాగా ఆడాడు. ఈ గేమ్‌లో తనూజను దగ్గరుండి గెలిపించిన భరణి ఆమెను భుజాలపై ఎత్తుకుని మురిసిపోయాడు.

కల్యాణ్‌ను గెలిపించిన శ్రీజ
సేఫ్ జోన్‌లో ఉన్న ఇమ్మూ, కల్యాణ్, రాము, దివ్య, భరణి, తనూజ (Thanuja Puttaswamy)లకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇది చిన్నప్పుడు ఆడుకున్న దాగుడు మూతల ఆట. ఈ ఆటలో చివరకు కల్యాణ్, తనూజ మిగిలారు. వీరిలో ఎవరు కెప్టెన్ కావాలన్నది డిసైడ్ చేయమని డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లను ఆదేశించాడు. ఇక్కడే శ్రీజ చక్రం తిప్పింది. తనూజకు అందరి సపోర్ట్ ఉంది.. కల్యాణ్‌కు లేదు.. అదీఇదీ చెప్పి అతడికి ఎక్కువ సపోర్ట్ వచ్చేలా చేసింది. కేవలం, సుమన్, సంజన మాత్రమే తనూజకు మద్దతిచ్చారు. మెజారిటీ సపోర్ట్ కల్యాణ్‌కు ఉండటంతో అతడు ఈ వారం కెప్టెన్‌గా నిలిచాడు.
కల్యాణ్‌ను గుడ్డిగా నమ్మేస్తున్న తనూజ
కెప్టెన్సీ బ్యాండ్ దివ్య చేతుల మీదుగా కట్టించుకుంటానన్నాడు. తనను వరస్ట్ ప్లేయర్ అన్న దివ్యతో బ్యాండ్ కట్టించుకుని కాలర్ ఎగరేశాడు. అయితే తనూజ ఆట అర్థం కావట్లేదని ఇమ్మూ, భరణి చర్చించుకున్నారు. కల్యాణ్‌ను గుడ్డిగా నమ్మేస్తోంది. సేఫ్ అవ్వాల్సిన తను.. డేంజర్ జోన్‌కి వెళ్లిందే వాడివల్ల! అయినప్పటికీ తర్వాత మనం తనను డేంజర్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాం. కానీ, కెప్టెన్సీ టాస్క్‌లో మళ్లీ వాడ్ని సపోర్ట్ చేసింది అని గుసగులాడారు. తనూజ అమాయకత్వం కల్యాణ్‌కు బాగా కలిసొచ్చింది. కల్యాణ్‌ను కెప్టెన్ చేస్తానని గతవారం మాటిచ్చిన శ్రీజ.. తన మాట నిలబెట్టుకుంది.
చదవండి: కాంతార విజయం.. రిషబ్‌కు మరో నేషనల్ అవార్డ్: స్టార్ డైరెక్టర్