సరికొత్త ప్రేమకథతో ‘ప్రేమిస్తున్నా’ | Soul Of Premistunnaa Out | Sakshi
Sakshi News home page

సరికొత్త ప్రేమకథతో ‘ప్రేమిస్తున్నా’

Oct 11 2025 3:51 PM | Updated on Oct 11 2025 4:06 PM

Soul Of Premistunnaa Out

సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు నటించిన తాజా చిత్రంప్రేమిస్తున్నా’.భాను దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా ను మేకర్స్ విడుదల చేశారు. 

56 సెకెన్స్ నిడివి ఉన్న ఈ విడియోలో సినిమా ఎలా ఉండబోతోందో చెప్పే ప్రయత్నం చేశారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్వచ్ఛమైన ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజెడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించబోతున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ...‘అన్ కండీషనల్ లవ్ తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో అంత అన్ కండీషనల్ లవ్ తో ఏ సినిమా రాలేదు, అద్భుతమైన పాటలు, పర్ఫార్మెన్స్ తో ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. చాలా కాలం తరువాత వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఈ సినిమా, మేము విడుదల చేసిన సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా కు అన్ని వర్గాల ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోందని’అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement