సమ్మర్‌ ట్రిప్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ప్రియాంక మోహన్‌ | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ ట్రిప్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ప్రియాంక మోహన్‌

Published Thu, May 23 2024 2:11 PM

Priyanka Arul Mohan Enjoy Now Summer Trip

సమ్మర్‌ వచ్చిందంటే సినీ తారల్లో చాలా మంది విదేశీ ట్రిప్‌కు రెడీ అయిపోతారు. అలాంటి ట్రిప్‌ను నటి ప్రియాంక మోహన్‌ ఇప్పుడు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ కన్నడ బ్యూటీ మాతృభాషతోపాటు, తెలుగు, తమిళం భాషల్లోనూ ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. తెలుగులో 'నాని' సరసన 'గ్యాంగ్‌లీడర్‌' చిత్రంలో నటించిన ఈమె ఆ తరువాత తమిళంలో శివకార్తీకేయన్‌కు జంటగా డాక్టర్‌, డాన్‌ చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాలు మంచి హిట్‌ కావడంతో ఈ వెంటనే నటుడు సూర్యకు జంటగా ఎదుర్కు తుణిందవన్‌ (ET) చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ప్రియాంక మోహన్‌కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

ఇటీవల ధనుష్‌ సరసన నటించిన కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రం ఈ అమ్మడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక తొలి రోజుల్లో పక్కింటి అయ్యాయి ఇమేజ్‌ను తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు గ్లామరస్‌ ఫొటోలతో హల్‌చల్‌ చేస్తూ అలాంటి పాత్రలకు రెడీ అనే సిగ్నల్‌ను పంపుతున్నారు. కాగా ప్రస్తుతం మరోసారి తెలుగులో నాని సరసన సరిపోదా శనివారం చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళంలో యువ నటుడు కవిన్‌తో జత కట్టే అవకాశం తలుపు తట్టింది. 

ఇలా నటిగా బిజీగా ఉన్న ప్రియాంక మోహన్‌ ప్రస్తుతం సమ్మర్‌ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఏ దేశంలో ఉన్నారో గానీ అక్కడ దిగిన ఫొటోలను సామాజక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్నారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement