మానస, సందీప్ కిషన్, మిథిలా పాల్కర్
హీరో సందీప్ కిషన్, హీరోయిన్ మిథిలా పాల్కర్, నటుడు మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ ‘సూపర్ సుబ్బు’. మల్లిక్ రామ్, రమేష్ ఎలిగేటి, శివాని ధోబాల్ రచించిన ఈ సిరీస్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో గెటప్ శ్రీను, మానస చౌదరి, జీవన్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. చిలకా ప్రోడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలకా, భరత్ లక్ష్మీపతి నిర్మించిన ఈ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘సూపర్ సుబ్బు’లో సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు చిల్లుకూరి రావు అనే టీచర్ పాత్ర చేశాను. ప్రజలు మాట్లాడటానికి సంకోచించే అంశాన్ని హాస్యం, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘మానవ సంబంధాలు, పరస్పర అవగాహన వంటి అంశాలను ఎంతో హాస్యంతో చెప్పిన కథ ఇది’’ అన్నారు మిథిలా పాల్కర్.


