
గత కొన్నిరోజులుగా టాలీవుడ్‌లో నిర్మాతలు vs సినీ కార్మికులు అనే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే వర్కర్స్ యూనివర్స్ సమ్మె చేస్తున్నారు. అటు నిర్మాతలు గానీ ఇటు యూనియన్స్ గానీ ఎవరూ కూడా తగ్గట్లేదు. దీంతో తర్వాత ఏం జరుగుతుందా అని అందరూ చూస్తున్నారు. ఇలాంటి టైంలో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఫిల్మ్ ఛాంబర్‌లో కలిసి మాట్లాడుకున్నారు. అనంతరం మీడియా సమావేశం పెట్టి వేతన పెంపు గురించి క్లారిటీ ఇచ్చారు.
(ఇదీ చదవండి: నా బలం, నా సర్వస్వం.. మహేశ్‌కి నమ్రత స్పెషల్ విషెస్)
రోజుకి రూ.2000, అంతకు లోపు గానీ వేతనం తీసుకునే కార్మికులకు మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% పెంచడానికి అంగీకరించారు. అలానే రోజుకి రూ.1000 లేదా అంతకంటే తక్కువ వేతనం తీసుకుంటున్న కార్మికులకు మొదటి ఏడాది 20% రెండవ ఏడాది 0%, మూడో ఏడాది 5% వేతనం పెంచడానికి నిర్మాతలు సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే నిర్మాతలు పెట్టిన కండిషన్స్‌కు ఫెడరేషన్ అంగీకరిస్తేనే ఈ వేతన పెంపునకు నిర్మాతలు అంగీకరిస్తారని నిర్మాతల మండలి పేర్కొంది.
నిర్మాతల వైపు నుంచి వేతన పెంపుపై స్పష్టత వచ్చింది. మరి వర్కర్స్ యూనియన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: మరో హిస్టరీ క్రియేట్ చేసిన 'మహావతార నరసింహ')