
'మహావతార్ నరసింహ' సినిమా విడుదలై నెల కావస్తుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. ఇప్పటికే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ యానిమేషన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఏకంగా రూ. 280 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. మూవీ భారీ విజయం అందుకోవడంతో తాజాగా మేకర్స్ కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు.
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. జులై 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ నిండిపోయాయి. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల విజయవంతంగా రన్ అవుతుంది.