చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద హడావుడి మామూలుగా ఉండదు. కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉంటాయి. ఈ వారం టాలీవుడ్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ-2 బాక్సాఫీస్ సందడి చేయనుంది. దీంతో పాటు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ దురంధర్ రిలీజవుతోంది. రెండు కూడా అగ్ర హీరోలు కావడంతో సినీ ప్రియుల్లోనూ అదేస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఫ్రైడే వచ్చిందంటే చాలు.. థియేటర్ మూవీస్‌తో పాటు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తుంటాయి. అలా ఈ శుక్రవారం పలు సూపర్ హిట్ మూవీస్ రెడీ అయిపోయాయి. వీటిలో రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రాలు కాస్తా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. వీటితో పాటు ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ లాంటి తెలుగు వెబ్ సిరీస్, డబ్బింగ్ చిత్రాలు, హాలీవుడ్ మూవీస్ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
ద గర్ల్‌ఫ్రెండ్ (తెలుగు మూవీ) - డిసెంబరు 05
- జే కెల్లీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 05
- స్టీఫెన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 05
- ద న్యూయర్కర్ ఎట్ 100 (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 05
- ది నైట్ మై డాడ్ సేవ్‌డ్ క్రిస్ట్‌మస్-2-డిసెంబరు 05
ది బ్యాడ్ గాయ్స్- బ్రేకింగ్ ఇన్- (యానిమేషన్ సిరీస్)- డిసెంబర్ 06
ఆహా
ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 05
జియో హాట్‌స్టార్
డీయస్ ఈరే (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 05
జీ5
ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు సినిమా) - డిసెంబరు 05
ఘర్‌వాలీ పెడ్వాలీ (హిందీ సిరీస్) - డిసెంబరు 05
బే దునే తీన్ (మరాఠీ సిరీస్) - డిసెంబరు 05
పరియా(బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్)- డిసెంబరు 05
సోనీ లివ్
కుట్రమ్ పురిందవన్ (తమిళ సిరీస్) - డిసెంబరు 05
సన్ నెక్స్ట్
అరసయ్యన ప్రేమ పసంగ (కన్నడ సినిమా) - డిసెంబరు 05
ఆపిల్ టీవీ ప్లస్
ద ఫస్ట్ స్నో ఆఫ్ ఫ్రాగల్ రాక్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 05


