పుష్ప సంధ్య థియేటర్ ఘటన జరిగి సరిగ్గా నేటికి ఏడాది. ఈ విషాద ఘటన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన భాస్కర్ సతీమణి రేవతి (35) కన్నుమూయగా, వారి కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి ఏడాది అయిన సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. భాస్కర్ కుటుంబానికి సాయం, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని గురించి వివరించారు. భాస్కర్, ఆయన సోదరుడితో కలిసి మాట్లాడారు.
దిల్ రాజు మాట్లాడుతూ..'గతేడాది సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ఘటనలో భాస్కర్ కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అల్లు అర్జున్ ముందుకు వచ్చి శ్రీతేజ్ పేరుపై రూ.2కోట్లు డిపాజిట్ చేశారు. ఆ డబ్బుపై వచ్చే వడ్డీతో నెలకు రూ.75వేలు భాస్కర్ కుటుంబ ఖర్చులు, శ్రీతేజ్ ఆస్పత్రి బిల్లులకు వినియోగిస్తున్నాం. మిగిలిన మొత్తాన్ని అసలులో కలిపి ఆపై వచ్చే వడ్డీని ఏటా పెంచి అందించేలా ఏర్పాటు చేశాం. ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం అల్లు అర్జున్, అల్లు అరవింద్ రూ.75 లక్షలు ఇప్పటికే చెల్లించారు. ఇంకా అదనపు సహకారం కావాలని భాస్కర్ అడుగుతున్నారు. ఈ విషయాన్ని బన్నీకి తెలిపా' అని దిల్ రాజు అన్నారు.
శ్రీతేజ్ తండ్రి భాస్కర్ మాట్లాడుతూ.. 'ఆ రోజు నుంచి ఇప్పటివరకూ అల్లు అర్జున్, బన్నివాస్‌ల సపోర్ట్ ఉంది. ఇంకా అదనపు సాయం కావాలని దిల్ రాజు సార్‌కు చెప్పా. బాబుకు ఆర్నెల్ల పాటు రిహాబిలిటేషన్ కొనసాగాల్సి ఉంది. ఇదే విషయాన్ని దిల్‌రాజు దృష్టికి తీసుకొచ్చాం. అందుకు అవసరమైన వైద్య ఖర్చులు గురించి కూడా చెప్పా. అల్లు అర్జున్ సార్‌తో మాట్లాడినందుకు దిల్ రాజుకు ధన్యవాదాలు' అని అన్నారు.
Facts r facts
Icon star @AlluArjun has already extended his support to Sritej, contributing a total of ₹3.20 Crores so far, including a fixed deposit of ₹1.5 Crores for the boy’s future. When Sritej’s father recently reached out again for additional financial help, #DilRaju… pic.twitter.com/0mHSu4NXCP— SKN (Sreenivasa Kumar) (@SKNonline) December 4, 2025


