బాలయ్య 'అఖండ-2' సినిమా వాయిదా | Akhanda 2: Thandavam Movie Release postponement | Sakshi
Sakshi News home page

బాలయ్య 'అఖండ-2' సినిమా వాయిదా

Dec 4 2025 11:59 PM | Updated on Dec 5 2025 7:15 AM

Akhanda 2: Thandavam Movie Release postponement

చిత్రం విడుదల వాయిదా 

మద్రాసు హైకోర్టు ఉత్తర్వులతో బ్రేక్‌ 

ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులే కారణం 

సాక్షి చెన్నై:  నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన అఖండ–2 చిత్రానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావల్సిన ఈ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రకటించింది. ప్రీమియర్‌ షో గురువారం రాత్రి ప్రదర్శించాల్సి ఉండగా దానిని రద్దుచేసినట్లు తెలిపింది. మద్రాసు హైకోర్టు నుండి వచి్చన తాజా ఉత్తర్వుతో విడుదలకు బ్రేక్‌ పడింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో సినిమా విడుదల వాయిదా పడింది.

14 రీల్స్‌ ప్లస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై అనుబంధ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా లిమిటెడ్‌ (ఈరోస్‌) వేసిన అప్పీల్‌ను హైకోర్టు పరిశీలించి ఈమేరకు ఆదేశించింది. ఈ రెండు సంస్థల మధ్య పాత ఆర్బిట్రేషన్‌ కేసు కొనసాగుతోంది, ఇందులో ఈరోస్‌కు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఆ ఆర్బిట్రేషన్‌ ప్రకారం.. ఈరోస్‌కు దాదాపు రూ.28 కోట్లతో పాటు, అసలు చెల్లింపు తేదీ వరకు 14 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంది.

ఇక కోర్టు స్పష్టంచేసిన మేరకు అఖండ–2ను ఏ రూపంలోనైనా విడుదల చేయాలంటే.. థియేటర్లు, ఇంటర్నెట్, ఉపగ్రహం లేదా ఏ ఇతర వాణిజ్య ప్లాట్‌ఫారం అయినాసరే ఈరోస్‌కు మొత్తం ఆర్బిట్రల్‌ అవార్డు మొత్తాన్ని చెల్లించాలి. ఈ చెల్లింపు పూర్తయ్యే వరకు విడుదల పూర్తిగా నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అఖండ–2 విడుదలైతే ప్రమోటర్లు పాత రుణ బాధ్యతలను పరిష్కరించకుండా వాణిజ్య లాభాలు ఆర్జించే అవకాశముందని ఈరోస్‌ కోర్టుకు తెలిపింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement