
'మహావతార్ నరసింహ' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా రేంజ్లో జులై 25న విడుదలైన ఈ యానిమేషన్ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో థియేటర్స్ నిండిపోయాయి. ఈ మూవీ ఆఫ్ సెంచరీ కొట్టడంతో డిలీటెడ్ సీన్ వీడియోను చిత్ర యూనిట్ పంచుకుంది. ఇప్పటికీ ఎన్ని థియేటర్స్లలో రన్ అవుతుందో కూడా పేర్కొంది.

అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం 200 థియేటర్స్ పైగానే 50 రోజులు పూర్తి చేసుకుందని మేకర్స్ ప్రకటించారు. ఆపై ఇప్పటి వరకు ఏకంగా రూ. 340 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ కూడా బుక్‌మైషోలో రోజుకు సుమారు 10వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అయితే, ఈ 50రోజుల్లో బుక్‌మైషో ద్వారా సుమారు 67 లక్షలకు పైగానే టికెట్లు కొనుగోలు చేశారు.