
ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) తాజాగా 'మహావతార్ నరసింహ' చిత్రాన్ని చూశారు. ఎవరూ ఊహించని రీతిలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ యానిమేషన్ చిత్రం అత్యంత ప్రజాదరణ పొందింది. ఆధ్యాత్మికత మార్గంలో యావత్ ప్రపంచాన్నే నడిపించే చాగంటి కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌తో పాటుగా చూశారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
పురాణాలకు చాలా దగ్గరగానే 'మహావతార్ నరసింహ' చిత్రం ఉందని చాగంటి అన్నారు. భక్త ప్రహ్లాద వంటి సినిమా ఇప్పటికీ ప్రజల మదిలో ఉండిపోయింది. మనుషులతో కాకుండా కేవలం బొమ్మలతో సినిమా తీసినా నిజంగా నరసింహ అవతారాన్ని చూసిన అనుభూతి కలిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చివరి సన్నివేషం చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చని సూచించారు.
శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి కూడా చాగంటి కోటేశ్వరరావుతో సినిమా చూశారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని ఆయన పంచుకున్నారు. వారిద్దరూ కలిసి 'మహావతార్ నరసింహ' సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలిపిన వీడియోను గీతా ఆర్ట్స్ షోషల్‌మీడియాలో షేర్ చేసింది.
జులై 25న విడుదలైన 'మహావతార్ నరసింహ' చిత్రాన్ని కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, ఇప్పటి వరకు ఈ మూవీ సుమారు రూ. 230 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా కన్నడలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా.. హోంబలే ఫిల్మ్స్‌తో కలిసి క్లీమ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.
Chaganti Koteswara Rao garu and K.I. Vara Prasad Reddy garu share their thoughts on #MahavatarNarsimha, applauding the team for delivering a truly divine experience.
Witness the divine saga at theatres near you. 🔥pic.twitter.com/qtHfd7XsJw— Geetha Arts (@GeethaArts) August 15, 2025