
'మహావతార్ నరసింహ' కలెక్షన్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది. జులై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. సినిమా రిలీజై ఆరు వారాలు పూర్తి అయినప్పటికీ కొన్నిచోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతుంది. దీంతో ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ను పంచుకుంది.

'మహావతార్ నరసింహ' చిత్రం రూ. 300 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరిపోయింది. ఇండియా బిగ్గెస్ట్ యానిమేటెడ్ చిత్రంగా నిలిచిందంటూ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ ప్రకటించింది. దేశాన్ని ఏకం చేసిన నరసింహ గర్జన అంటూ పేర్కొంది. శ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి అల్లు అరవింద్ విడుదల చేశారు. కేవలం తెలుగులోకే రూ. 47 కోట్ల నెట్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
The roar that united the nation 🦁🔥
300 Cr+ Worldwide Gross & Counting… 💥
India’s biggest animated blockbuster, #MahavatarNarsimha continues its legendary box office run into its 6th week!#Mahavatar @hombalefilms @AshwinKleem @kleemproduction @VKiragandur @ChaluveG… pic.twitter.com/swIBVl0y4x— Hombale Films (@hombalefilms) August 29, 2025