ఈ సారికి వదిలేయండి.. మళ్లీ తప్పు జరగకుండా చూసుకుంటా: కలర్ ఫోటో డైరెక్టర్‌ | Tollywood Director Sandeep Raj Tweet On His Latest Web Series Scene | Sakshi
Sakshi News home page

Sandeep Raj: 'మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమించండి.. మళ్లీ తప్పు చేయను'

Jul 6 2025 2:40 PM | Updated on Jul 6 2025 3:11 PM

Tollywood Director  Sandeep Raj Tweet On His Latest Web Series Scene

షార్ట్‌ ఫిల్మ్‌లతో కెరీర్‌ ప్రారంభించిన సందీప్‌ రాజ్‌.. కలర్‌ ఫోటో చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నటుడిగా కూడా పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన డాకు మహారాజ్‌ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. తాజాగా సందీప్‌ ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌ ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఈ సిరీస్‌ ఓ సన్నివేశంపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. దీంతో ట్విటర్‌ వేదికగా సందీప్‌ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చారు.

సందీప్‌ తన ట్వీట్‌లో రాస్తూ..' డియర్ బ్రదర్స్..  2025 ఏడాదిని గొప్పగా ప్రారంభించా. డాకు మహారాజ్ వంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రంలో భాగం కావడం చాలా సంతోషంగా అనిపించింది. ఆ సమయంలో నాకు లభించిన ప్రేమ, మరింత కష్టపడేందుకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
కానీ ఇప్పుడు అదే ఖాతాల నుంచి, అదే వ్యక్తుల నుండి ద్వేషాన్ని చూపటం నా హృదయాన్ని కలిచివేసింది. జనవరిలో  అభినందనలకు అర్హుడినో కాదో తెలియదు.. జూలైలో వస్తోన్న ఈ ద్వేషానికి అర్హుడనా? అంటే స్పష్టంగా అవుననే అనిపిస్తోంది. నేను  ఈ విషయాలను కప్పిపుచ్చడానికి,  మేము చేసిన దానికి సమర్థించడానికి ఇక్కడ లేను. ఎల్లప్పుడూ ప్రేక్షకులే కరెక్ట్‌ అనే ఒకే ఒక నినాదాన్ని మాత్రమే ఒక చిత్రనిర్మాతగా  నమ్ముతా. ఆ నిర్దిష్ట కంటెంట్ మిమ్మల్ని బాధపెడితే. అందులో భాగమైనందుకు  చాలా చింతిస్తున్నా. నాకు ఎవరిపై ద్వేషం లేదు. ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదు. అంతే కాదు మిమల్ని ఇబ్బందిపెట్టిన ఆ సీన్‌ను తొలగించాం.' అని పోస్ట్ చేశారు.

ప్రతి ఒక్కరూ తమ కెరీర్ ప్రారంభ రోజుల్లో తప్పులు చేస్తారని సందీప్ రాసుకొచ్చారు. ఇప్పుడు మేము కూడా అదే చేశామని.. అయితే వెంటనే దానిని సరిదిద్దుకున్నామని ట్వీట్‌లో ప్రస్తావించారు. ఇలాంటివీ మళ్లీ చేసే ఉద్దేశం అయితే తమకు అస్సలు లేదన్నారు. ఈ వెబ్ సిరీస్‌ను యువ ప్రతిభావంతులు వారి కెరీర్‌ ఆధారంగానే రూపొందించామని సందీప్‌ వివరణ ఇచ్చారు. ఇందులోని నాటకీయత, భావోద్వేగాలు కొత్తదనం కోసం మేము ఈ సిరీస్‌ను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి నుంచి కంటెంట్‌ విషయంలో మరింత బాధ్యతాయుతంగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నా..ఈ వారాంతంలో మీ మనస్సులను బాధపెట్టినందుకు క్షమించండి... నాపై, నా బృందంపై మీ కోపాన్ని చల్లార్చడానికి మరో అద్భుతమైన కంటెంట్‌తో  మీ ముందుకొస్తాను అంటూ సందీప్‌ పోస్ట్ చేశారు. 'ఈ సారికి వదిలేయ్ అన్నా… నిన్ను నొప్పించాలి అని చేయలేదు' అని మా టీమ్ తరఫున మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement