
గతేడాది 'అమరన్' సినిమాతో హిట్ కొట్టిన తమిళ హీరో శివకార్తికేయన్.. ఇప్పుడు కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అదే 'మదరాశి'. చాన్నాళ్లుగా హిట్ లేక సతమతమవుతున్న ఏఆర్ మురుగదాస్ దీనికి దర్శకుడు. సెప్టెంబరు 5న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫుల్ యాక్షన్‌తో ఆకట్టుకుంటోంది.
ఈ ఏడాది సల్మాన్ ఖాన్‌తో 'సికిందర్' తీసి ఘోరమైన డిజాస్టర్ అందుకున్న మురుగదాస్.. 'మదరాశి'తో కమ్ బ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే మంచి యాక్షన్ థ్రిల్లర్ చూడబోతున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో శివకార్తికేయన్ జోడీగా రుక్మిణి వసంత్ కనిపించనుంది. విద్యుత్ జమాల్ విలన్. అనిరుధ్ సంగీత దర్శకుడు.
'మదరాశి' సినిమాతో పాటు సెప్టెంబరు 5న అనుష్క లీడ్ రోల్ చేసిన 'ఘాటీ', 'లిటిల్ హార్ట్స్' అనే మరో తెలుగు మూవీ కూడా థియేటర్లలోకి రానున్నాయి. చాలా కాలంగా మురుగదాస్ ఫామ్‌లో లేడు. దీంతో ఈ చిత్రంపై పెద్దగా అంచనాల్లేవు. కానీ ట్రైలర్ చూస్తుంటే గన్స్, మాఫియా లాంటి అంశాలు కాస్త ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి రిజల్ట్ ఏమవుతుందో?