బాలీవుడ్ హీరోయిన్, గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందింది. కియారా- సిద్దార్థ్ (Sidharth Malhotra) జంటకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. శుక్రవారం నాడు పాప పేరును సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే ఓ ఫోటోను సైతం షేర్ చేశారు. మా ప్రార్థనల నుంచి మా చేతుల్లోకి వచ్చిన మా బుజ్జిపాపాయి.. సరాయా మల్హోత్రా (Saraayah Malhotra) అని రాసుకొచ్చారు.
సిద్దార్థ్‌లోని స అక్షరాన్ని, కియారాలోని యారా అక్షరాలను కలిపితే వచ్చేలా సరాయా అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. సరాయా అంటే అరబిక్‌లో యువరాణి అని అర్థం. అయితే పాప ముఖాన్ని మాత్రం చూపించలేదు. కేవలం సాక్సులు తొడిగిన పాప కాళ్లను పట్టుకున్న ఫోటో మాత్రమే షేర్ చేశారు. ఏదేమైనా కియారా జంటకు అభిమానులు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సిద్దార్థా- కియారా 2023 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 15న వీరికి కూతురు పుట్టింది.
సినిమాలు
సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కియారా తెలుగులో మాత్రం పెద్దగా క్లిక్కవ్వలేదు. మహేశ్‌బాబు సరసన 'భరత్ అనే నేను', రామ్‌చరణ్ సరసన 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్' చిత్రాలు చేసింది. ఈ ఏడాది హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్ 'వార్ 2' మూవీలో తళుక్కుమని మెరిసింది. ప్రస్తుతం యష్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' సినిమాలో నటిస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రా చివరగా 'పరమ సుందరి' సినిమా చేశాడు. ప్రస్తుతం 'వాన్: ఫోర్స్ ఆఫ్ ద ఫారెస్ట్' మూవీలో యాక్ట్ చేస్తున్నాడు.
చదవండి:


