
ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. ఇప్పటికే మూడు సీజన్స్ రిలీజ్ కాగా.. అభిమానుల ఆదరణ దక్కించుకున్నాయి. అయితే ఈ సిరీస్లో మన సినీతారలు నటిస్తే ఎలా ఉంటుందో చూపించే వీడియోలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఏఐ సాయంతో పలువురు స్టార్స్తో స్క్విడ్ గేమ్ సిరీస్ వీడియోలు రూపొందించారు.
అయితే మన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి- స్క్విడ్ గేమ్ కలిపి చూస్తే ఎలా ఉంటుంది. మీకు కూడా అలా చూడాలని అనిపిస్తోందా? అయితే ఈ వీడియో మీ కోసమే చేసినట్లు ఉంది. బాహుబలి- స్క్విడ్ గేమ్ సీన్స్ను కలిపి ఓ వీడియోను రూపొందించారు. బాహుబలి ఇన్ స్క్విడ్‌గేమ్ అంటూ సినిమా, వెబ్‌సిరీస్‌ను కలిపి క్రియేట్ చేసిన క్రాస్ ఓవర్ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. బాహుబలిలోని ప్రభాస్, కట్టప్ప స్క్విడ్ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూపించిన విధానం నవ్వులు తెప్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.