
తెలుగులోనూ వరుస విజయాలతో దూసుకెళుతున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తాజాగా ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రవి నేలకుదిటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బుచ్చిబాబు సానా కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నాని క్లాప్ కొట్టారు.
గుణ్ణం సందీప్, నాని, రమ్య గుణ్ణం స్క్రిప్ట్‌ను టీమ్‌కు అందజేశారు. ‘‘చక్కని లవ్‌స్టోరీతో పాటు అద్భుతమైన హ్యూమన్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నాం. తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: అనయ్ ఓం గోస్వామి.