తెలుగు యువ దర్శకుడికి కోడిరామకృష్ణ అవార్డ్ | Thallada Saikrishnawins Young Talent Director Award | Sakshi
Sakshi News home page

Thallada Saikrishna: తల్లాడ సాయి కృష్ణకి యువ ప్రతిభ డైరెక్టర్ అవార్డ్

Jul 24 2025 9:12 PM | Updated on Jul 24 2025 9:12 PM

Thallada Saikrishnawins Young Talent Director Award

టాలీవుడ్ యువ దర్శకుడు తల్లాడ సాయి కృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనను కోడిరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్ వరించింది. ఏడాది ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయికృష్ణకు యువ ప్రతిభ డైరెక్టర్ అవార్డ్అందజేశారు. ప్రతి ఏటా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నిర్వహిస్తున్నారు. తెలుగు సినీ రంగంలో తనదైన శైలిలో కథలతో సాయికృష్ణ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ అవార్డు, ఆయన కథ రచన, దిశానిర్దేశం, స్క్రీన్‌ప్లే రంగాల్లో చూపించిన సృజనాత్మకతకు గుర్తింపుగా దక్కించుకున్నారు. ఇటీవల ఆయన రూపొందించిన నమస్తే సేట్ జీ, దక్ష, మిస్టరీ సినిమాలకి మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు ద్వారా యువ దర్శకులలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన కోడిరామకృష్ణ ఫిల్మ్ ఫౌండేషన్‌కు, తుమ్మలపల్లి రామసత్య నారాయణకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సందర్భంగా తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ "ఇది కేవలం ఒక అవార్డ్ కాదు.. నా మీద ఉన్న నమ్మకానికి గుర్తింపు.. తెలుగు సినిమా కోసం ఇంకా ఎన్నో వినూత్న ప్రయోగాలు చేయాలని ఉంది. నా టీమ్, నటీనటులు, టెక్నీషియన్లు, ప్రేక్షకులందరికీ ఇది అంకితం." అని తెలిపారు. కాగా.. ఈ కార్యక్రమానికి హీరో సుమన్, డైరెక్టర్ రేలంగి, నీహారిక కొణిదెల కూడా హాజరయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement