తమిళ హీరో అశ్విన్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. తను ప్రధాన పాత్రలో నటించిన హాట్‌స్పాట్ 2 మచ్ మూవీ త్వరలో రిలీజవుతోంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన సినిమా ప్రెస్‌మీట్‌లో ఓ రిపోర్టర్ అతడిని అవమానించేలా ప్రశ్న అడిగాడు. మీకు కథలు చెప్పేటప్పుడు నిద్రపోతున్నారా? లేదా మెలకువతో ఉండి వింటున్నారా? అని ప్రశ్నించాడు. అది విని అశ్విన్ అసహనానికి లోనయ్యాడు.
హీరో కౌంటర్
మీరెప్పుడూ సినిమా చూసేటప్పుడు థియేటర్‌లో నిద్రపోలేదా? అని తిరిగి ప్రశ్నించాడు. అప్పుడేదో 40 కథలు చెప్పేసరికి నిద్రపోయానన్నాను. బహుశా ఆ సంఖ్య 40 కన్నా ఎక్కువే ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. అయినా దానిపై గతంలోనే క్లారిటీ ఇచ్చాను. అయినప్పటికీ మళ్లీ మళ్లీ అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? నన్ను అవమానించడానికా? అని కోప్పడ్డాడు.
గతంలో ఏం జరిగింది?
2022లో ఎన్న సొల్ల పోగిరై మూవీ ఆడియో లాంచ్‌లో అశ్విన్ కుమార్ మాట్లాడాడు. ఒకేరోజు దాదాపు 40 కథలు విన్నానని, అవి చాలా చప్పగా ఉండటంతో సగంలోనే నిద్రపోయానన్నాడు. ఆయన కామెంట్స్‌పై నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన.. ఎవరినీ బాధపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదంటూ క్షమాపణలు చెప్పాడు. అక్కడితో ఆ వివాదం సమసిపోయింది.
హాట్‌స్పాట్ 2 మచ్ విషయానికి వస్తే.. ఇది 2024లో వచ్చిన హాట్‌స్పాట్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. విఘ్నేశ్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. అశ్విన్ కుమార్‌తో పాటు ప్రియ భవానీ శంకర్, ఆదిత్య భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ తమిళ చిత్రం జనవరి 23న విడుదలవుతోంది. కాగా సీరియల్స్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ కుమార్ (Ashwin Kumar Lakshmikanthan).. తెలుగులో అన్నీ మంచి శకునములే సినిమాలోనూ యాక్ట్ చేశాడు.
#Reporter: Are you sleeping now listening to stories or you woke up❓#AshwinKumar: 40 is the number which I said generally, it could be more or less. Have you never slept while watching films in theatres? Why are you bringing this question now & degrading me? It was not to hurt… pic.twitter.com/RPhtEoSfo0
— AmuthaBharathi (@CinemaWithAB) January 20, 2026
చదవండి: రాజాసాబ్ ఫ్లాప్.. ప్రభాస్ రియాక్షన్ ఏంటో చెప్పిన నిధి అగర్వాల్


