తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్‌లు | Tamil Nadu Political Drama, Governor Cancels Kerala Visit, Meets TVK Vijay To Clear Way For His Swearing In As CM | Sakshi
Sakshi News home page

తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్‌లు

May 9 2026 6:24 PM | Updated on May 9 2026 8:06 PM

Governor Cancels Kerala Visit: Appointment To Tvk Vijay

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. కేరళం పర్యటనను గవర్నర్‌ రద్దు చేసుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విజయ్‌కు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. అయితే, విజయ్‌కు గవర్నర్‌ తొలుత.. అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. దీంతో లోక్‌భవన్‌కు వచ్చిన విజయ్‌.. వెనుదిరిగారు. కేరళంకు వెళ్లడానికి సిద్ధమైన గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌కు ముందస్తు అపాయింట్‌మెంట్‌ ఉండటంతో విజయ్‌కు సమయం ఇవ్వలేదు.

విజయ్‌ కంటే ముందుగా లోక్‌భవన్‌కు సీపీఎం నేతలు చేరుకోగా.. వారిని కూడా లోక్‌భవన్‌ సిబ్బంది వెనక్కి పంపించారు. అయితే, చివరి క్షణంలో గవర్నర్‌ తన మనస్సు మార్చుకున్నారు. కేరళం పర్యటనను రద్దు చేసుకున్నారు. విజయ్‌కు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. టీవీకేకు వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీసీకే నుంచి మద్దతు లేఖ కూడా టీవీకే బృందం అందుకుంది. దీంతో వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది.

ఐయూఎంఎల్‌ కూడా మద్దతు ఇవ్వడంతో విజయ్‌కు ఎమ్మెల్యేల మద్దతు 121కి చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు మద్దతు ఇచ్చాయి. వీసీకే, ఐయూఎంఎల్‌ ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేయడానికి.. మరోసారి గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ను విజయ్‌ కోరారు. ఇవాళ(శనివారం) సాయంత్రం గవర్నర్‌ను కలిసిన విజయ్‌.. తనకు మద్దతు ఇస్తు‍న్న వారి పేర్లతో లేఖను అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.

రేపు తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణస్వీకారం
టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ అనుమతి ఇచ్చారు. రేపు(మే 10, ఆదివారం) నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్‌.. ఎమ్మెల్యేల మద్దతు జాబితా గవర్నర్‌కు అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement