చెన్నై: బాత్రూం, టాయిలెట్‌లో సెల్‌ఫోన్ కెమెరాలు ఏర్పాటు చేసి మహిళల వీడియోలను తీసిన టీ దుకాణం యజమానిని అరెస్టు చేశారు. వివరాలు.. తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని రాసిపురం సమీపం ఆండకలూర్ గేట్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కాంప్లెక్స్‌లో ఒక టీ దుకాణం ఉంది. ఐదు రూపాయలకే టీ అమ్ముతూండటంతో ఈ దుకాణం దగ్గర రద్దీ ఎక్కువ. వెన్నండూరుకు చెందిన నాగరాజ్ (27) ఇక్కడ టీ చేస్తూంటాడు.
నాగరాజ్ టాయిలెట్‌కు వెళ్లి తన సెల్‌ఫోన్ వీడియో ఆన్ చేసి వచ్చాడు. ఆ తర్వాత టాయిలెట్‌కు వెళ్లిన ఒక మహిళ దృశ్యాలు ఆ వీడియో రికార్డ్ అయిందని తెలుసుకుని దిగ్భ్రాంతి చెంది కేకలు వేసింది. అక్కడున్న వారు వెళ్లి తనిఖీ చేసి సెల్‌ఫోన్ తీసుకున్నారు. వారు ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సెల్ ఫోన్‌ను స్వాదీనం చేసుకున్న నాగరాజ్‌పై కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు. అతని సెల్ ఫోన్ లో అనేక అశ్లీల చిత్రాలు ఉన్నట్లు తేలింది.


