తమిళనాడు టెంకాసి జిల్లాలో ఈరోజు (సోమవారం) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు ప్రైవేట్ బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 28 మంది గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాలు.. మదురై నుంచి శేంకొట్టైకి వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు, టెంకాసి నుంచి కోవిల్‌పట్టి వైపు వెళ్తున్న మరో బస్సు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి.
రెండు బస్సులు ఢీకొన్న తీవ్రత కారణంగా ఆ వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు భారీ రక్షణ చర్యలు చేపట్టారు.
ప్రాథమిక దర్యాప్తులో మదురై-శేంకొట్టై మార్గంలో వెళ్లిన ‘కీసర్’ అనే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. డ్రైవర్ అత్యధిక వేగంతో నడపడం వల్ల ప్రమాదం జరిగిందని సమాచారం.
ప్రమాదంలో గాయపడిన 28 మంది సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


