డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్‌ను వేగంలో ఉన్న ఢీకొట్టింది. ఈ ప్రమాదం సందర్భంగా బైక్ పైన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలోని గౌరా పడావ్‌లో ఓ బైకర్ రాంగ్ రూట్‌లో వచ్చాడు. బైక్‌తో రోడ్డు క్రాస్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇదే సమయంలో వేగంతో వస్తున్న కారు.. సదరు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో, ఒక్కసారిగా బైక్, దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాల్లోకి ఎగిరి కిందపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనలో బైకర్‌దే తప్పు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు.. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. వారిని వాన్భూల్‌పుర నివాసితులుగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు.


