సాక్షి, హైదరాబాద్: టోలిచౌకిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు నిర్లక్ష్యానికి యువకుడు బలయ్యాడు. డెలివరీ బాయ్‌పైకి ప్రైవేట్ బస్సు దూసుకెళ్లింది. ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్తూ. అభిషేక్.. బైక్ స్కిడ్ అయి పడిపోయాడు. గమనించకుండా.. ఆ యువకుడి తలపైకి డ్రైవర్ బస్సు ఎక్కించాడు. స్పాట్‌లోనే అభిషేక్ మృతి చెందాడు. ఆపకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేసిన బస్సు డ్రైవర్‌ను వాహనదారులు అడ్డగించి బస్సును నిలిపివేయించారు.
ప్రమాదం తర్వాత రోడ్డుపై మృతదేహం పడి ఉన్నా.. వాహనదారులు పట్టించుకోలేదు. మానవత్వం లేకుండా వెళ్లిపోయారు. బతికి ఉన్నాడో.. చనిపోయాడోనని చూసే ప్రయత్నం కూడా చేయని వాహనదారులు.. మృతదేహం పక్కనుంచే వెళ్లిపోయారు.


