మేడ్చల్: మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శామీర్‌పేట వద్ద ఓఆర్‌ఆర్‌పై కారు అగ్నికి ఆహుతైంది. కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. డ్రైవర్ తేరుకునేలోపే కారును మంటలు చుట్టుముట్టడంతో ఇక తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
కీసర వెళ్తండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో ఏసీవేసుకుని పడుకున్న సమయంలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఇదిలా ఉంచితే, ఈ నెలలోనే సంగారెడ్డి ఓఆర్‌ఆర్‌పై ఒక కారు అగ్ని ప్రమాదం బారిన పడింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు కానీ కారు అగ్నికి ఆహుతైంది. గత నెలలో పఠాన్‌చెరువు సమీపంలో ముతంగి ఓఆర్‌ఆర్‌పై ఓ కారులో మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులు ఎవరూ కూడా ప్రమాదం బారిన పడకుండా తప్పించుకున్నారు.
ఓఆర్‌ఆర్‌పై ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే 14449 నెంబరుకు కాల్ చేయవచ్చు. ప్రమాదాలు కానీ, వాహనాల బ్రేక్‌డౌన్, పెట్రోలు, డీజిల్ ఖాళీ అయినా, పంక్చర్లు అయినా ఈ నెంబరుకు కాల్ చేస్తే సాయం అందుతుంది. ఇది కాకుండా పోలీసుల హెల్‌్పలైన్ 100, ఆంబులెన్స్ కోసం 108, అగ్ని ప్రమాదాల సందర్భంలో 101కు కాల్ చేసి సాయం అందుకోవచ్చు.
కార్లు అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణాలు..
- ఓఆర్‌ఆర్‌పై వేగంగా డ్రైవ్ చేయడం కూడా కార్లు తరుచు ప్రమాదంబారిన పడటానికి ప్రధాన కారణం. కార్లను అత్యంత వేగంగా, ఓఆర్‌ఆర్‌పై నిర్దేశించిన వేగం కంటే కారును నడుపుతున్న సందర్భాల్లో ఇంజిన్ ఓవర్‌హీట్ అవుతూ ఉంటుంది. దాంతో కార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
- ఆయిల్ లీక్ అంశం కూడా కార్లు తొందరగా అగ్నికి ఆహుతి కావడానికి మరో కారణం. ఇక ఎలక్ట్రికల్ లోపాలతో కూడా కార్లు అగ్ని ప్రమాదం బారిన పడుతున్నాయి.
- ఓఆర్‌ఆర్‌పై ఏదైనా కారు ప్రమాదానికి గురైనప్పుడు అగ్ని మాపక వంటి సహాయక చర్యలు చేపట్టడం ఆలస్యం అవుతుంది. ఓఆర్‌ఆర్ పై ప్రమాదం సమాచారం అందుకున్న తర్వాత స్పాట్‌కు ఎమర్జెన్సీ సర్వీసులు చేరుకోవడం అత్యంత కష్టంతో కూడుకున్నదిగా మారింది. గ ఓఆర్‌ఆర్‌పై కార్లు అగ్ని ప్రమాదం బారినపడ్డప్పుడు ఎమర్జెన్సీ సర్వీసులు సరైన సమయానికి రావడం అనేది ఏవో కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది.

డ్రైవర్లు ఇలా చేస్తే..
- రెగ్యులర్‌గా కార్లను చెక్ చేయడం అనేది డ్రైవర్లు పనిగా పెట్టుకోవాలి. వాహనం ఎలక్రికల్ వైరింగ్,ఆయిల్ ట్యాంక్, టైర్లు వంటి రెగ్యులర్‌ాగా జరిగేప్రాసెస్‌గా ఉండాలి
- ఓఆర్‌ఆర్‌పై ాకార్లను పార్కింగ్ చేయడం అనేది మానేయాలి. ఓఆర్‌ఆర్‌ై వాహనాలను నిలిపి ఉంచడం అనేది నిషిద్ధమే కాదు.. ప్రమాదం కూడా .
- కారు నుంచి పొగలు రావడం గమనిస్తే వెంటనే నిలిపివేయాలి. వెంటనే కారు నుంచి దిగిపోవాలి.


