సాక్షి,శ్రీకాకుళం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తుపాన్ వాహనంలోని నలుగురు ప్రయాణికులు ఘటనా స్థలంలో మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం కోటబొమ్మాళి ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఒరిస్సా నుంచి విశాఖకు వెళుతుండగా ఆదివారం తెల్లవారు జామున ఘటన జరిగినట్లు సమాచారం.
మృతులు భోరోసింగ్ పవర్ (60), విజయ్ సింగ్ తోమర్ (65), ఉషీర్ సింగ్ (62), సంతోషి భాయ్ (62)లుగా పోలీసులు గుర్తించారు.


