ఎంపీపీగా విధులు చేపట్టిన చిరంజీవి
ఎచ్చెర్ల: ఫరీదుపేటకు చెందిన మొదలవలస చిరంజీవి ఎచ్చెర్ల ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి.. హైకోర్టు ఆదేశాలతో రద్దు కావడంతో ఈనెల 21న విడుదలైన విషయం విదితమే. ఆయన యథావిధిగా శనివారం ఉదయం మండల పరిషత్‌కు వచ్చి ఎంపీపీ చాంబర్‌లో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కార్యకర్త్తలను కలుసుకుని మండలంలోని అభివృద్ధి పనులకు సంబంధించి పలు సమస్యలపై చర్చించారు.
శ్రీకాకుళం: జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్‌గా పప్పల వేణుగోపాలరావు శనివారం బాధ్యత లు స్వీకరించా రు. మాతృ శాఖ కు బదిలీ అయిన సంపతిరావు శశిభూషణ్ నుంచి అయన శనివారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులను పరిచ యం చేసుకుని ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను ఆయన ఛాంబర్‌లో వేణుగోపాలరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
శ్రీకాకుళం క్రైమ్ : ఆంధ్రా–ఒడిశా బోర్డర్‌లో మావోల కదలికలపై పూర్తి పోలీసు నిఘా పెట్టామని, జిల్లాలో అయితే నక్సల్స్ ప్రభావం ప్రస్తుతానికి లేదని ఎస్పీ మహేశ్వరరెడ్డి అన్నా రు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులతో ఎస్పీ మాట్లాడుతూ.. నక్సలిజం ఐడియాలజీతో ఉన్నవారిపై, కొత్తగా ప్రవేశించేవారిపై ఇప్పటికే నిఘా పెట్టామన్నారు. మావోలే లక్ష్యంగా ఉన్న రాజకీయ, ఇతర వీఐపీలకు ఇప్పటికే అవగాహన కల్పించామన్నా రు. నేషనల్ హైవేలో ప్రమాదాలు జరుగుతు న్నాయని, టోల్‌గేట్లు, అండర్‌పాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిల వద్ద అధికంగా ట్రాఫిక్ అంతరాయం, షాపులు వెలుస్తుండటాన్ని విలేకరులు ప్రస్తావించగా.. నేషనల్ హైవే, ఆర్‌అండ్‌బీ, మున్సి పాలిటీ వాళ్లతో మాట్లాడామని నిబంధనలు అనుసరించి చర్యలుంటాయన్నారు. జిల్లాలో ఇప్పటికి 87 బ్లాక్‌స్పాట్‌లు గుర్తించగా హైవేలో 52 ఉన్నాయన్నారు. ఎక్కువగా ఉదయం 3 నుంచి 7 గంటల్లోపు, సాయంత్రం 3 గంటల నుంచి 6 లోపు ప్రమాదాలవుతున్నాయని, వీటిలో ద్విచక్రవాహనాల ప్రమాదాలే అధికమన్నారు. గార ఎస్బీఐ బ్యాంకులో తనఖా బంగా రం మాయం కేసుకు సంబంధించి విచారణ దాదాపు పూర్తికావస్తుందని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: అస్మిత అథ్లెటిక్స్ మీట్ బాలికల పోటీలు వాయిదా పడ్డాయి. శ్రీకాకు ళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఈ నెల 23న జరగాల్సిన పోటీలను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసినట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి తెలిపారు. అథ్లెటిక్స్‌లో అండర్–14, అండర్–16 విభాగాల్లో ప్రతిభ కలిగిన బాలిక లను గుర్తించేందుకు ఈ పోటీలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. పోటీల వాయిదా విషయాన్ని క్రీడాకారిణిలు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్‌లు, అథ్లెట్స్ తల్లిదండ్రులు గుర్తించాలని కోరారు.


