తనిఖీల పేర్లతో వసూళ్లు
వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరు మండలం రెవెన్యూ శాఖలో వసూళ్ల పర్వం కలకలం రేపుతోంది. రేషన్ సరుకుల పంపిణీ (ఎఫ్‌పీ) షాపు తనిఖీల సందర్భంగా రూ.1500 ఇవ్వాల్సిందేనని అధికారి డిమాండ్ చేస్తుండడంతో ఓ వీఆర్‌ఏ ద్వారా ఈ వసూళ్లు చేపడుతున్నారు. దీంతో డీలర్లు లబోదిబోమంటున్నారు. మొన్ననే దసరా మామూళ్లు అంటే షాపునకు రూ.200 చొప్పున ఇచ్చామని, ఇప్పుడే మో మళ్లీ తుఫాన్ సరుకుల తనిఖీతో రూ.1500 అడిగితే తాము ఎక్కడి నుంచి తేవాలని డీలర్లు వా పోతున్నారు. మోంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను రేషన్ డీలర్లకు పంపిణీ చేశారు. వీటి తనిఖీల్లో రెవెన్యూ అధికారులు వసూళ్ల పర్వానికి తెర తీశారు. ఈ తంతు మొత్తం వజ్రపుకొ త్తూరు రేషన్ డీలర్ల వాట్సాప్ గ్రూపుల్లో చర్చకు దారి తీసి బయటకు పొక్కింది.
గత ఏడాది కాలంగా ఉప తహసీల్దార్, తహసీల్దార్, వీఆర్‌ఓల మధ్య కోల్డ్‌వార్ నడుస్తుండగా తాజాగా ఉప తహసీల్దార్ మురళీకృష్ణకు కొత్తూరు కు బదిలీ జరిగింది. మరోపక్క కొంత మంది రేషన్ డీలర్లే అధికారుల ప్రాపకం కోసం డీలర్ల నుంచి వసూలు చేసి అందిస్తున్నట్లు చర్చ గుప్పుమంది. మ్యుటేషన్, పట్టాదారు పాస్ పుస్తకం, పోతీ కేసు లు, రియల్ ఎస్టేట్, నాలా, డెత్, బర్త్ (ఎల్‌ఆర్‌బీడీ) లకు రూ.5వేలు నుంచి రూ.10 వేలు వరకు వసూ ళ్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పైగా పైసలు ముడితే తప్ప ఇక్కడ కార్యాలయంలో ఫైలు కదలదని నగరంపల్లి, గుళ్లపాడుకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వజ్రపు కొత్తూరు తహసీల్దార్ డీవీ సీతారామయ్యను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. సీఎస్‌డీటీ కె.రామారావును వివరణ కోరగా వసూళ్ల విషయం తన దృష్టికి రాలేదని, తాను కొన్ని, తహసీల్దార్ కొన్ని షాపులను తనిఖీ చేస్తున్నామని తెలిపారు.
రేషన్ డీలర్ల వాట్సాప్ గ్రూపులో జరిగిన
సంభాషణ
రేషన్ డిపోను తనిఖీ చేస్తున్న రెవెన్యూ అధికారులు
తనిఖీల పేర్లతో వసూళ్లు


