అక్కడి అమ్మాయి.. ఇక్కడి అబ్బాయి
శ్రీకాకుళం కల్చరల్: వివాహాల విషయంలో దేశాల హద్దులు కూడా చెరిగిపోతున్నాయి. శ్రీకాకుళానికి చెందిన శ్రీరంగనాథ్ సాహిత్, బెల్జియంకు చెందిన కెమిలీ శనివారం బలగ రోడ్డులోగల శాంతి కన్వెన్షన్ హాల్‌లో హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. సాహిత్ శ్రీకాకుళంలో పుట్టి ఇక్కడే చదువుకొని కంప్యూటర్ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తాను పనిచేస్తున్న కంపెనీ ద్వారా లండన్ దేశానికి వెళ్లగా అక్కడ బెల్జియంకు చెందిన కెమిలీ పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకువచ్చింది. ఇరు కుటుంబాల వారు పెళ్లికి సమ్మతించడంతో ఈ అరుదైన పెళ్లికి శ్రీకాకుళం వేదికగా నిలిచింది. వరుడి తల్లి తిరునగరి పద్మావతి హిందీ టీచర్‌గా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్నారు. నగరంలోని హయాతినగరంలోని సాయిభవానీ నగర్‌కాలని మొదటి లైన్‌లో నివాసం ఉంటున్నారు.
అక్కడి అమ్మాయి.. ఇక్కడి అబ్బాయి


