శత వత్సరం.. సేవా సమాహారం
నగరంలో నేడు
● సత్యసాయి శతవర్ష జయంతి ఉత్సవాలకు సిద్ధం ● పలు చోట్ల సేవా కార్యక్రమాలు
బాబా మార్గాన్ని భక్తులు అనుసరిస్తున్నారు. సర్వమానవాళి శ్రేయస్సు కోసం సత్యసాయి చెప్పిన సూక్తులను గుండెల్లో పెట్టుకుని శత వర్ష సంబరాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
సేవే దైవంగా భావించి సత్యసాయి వందో జయంతి నాడు జిల్లావ్యాప్తంగా ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నేడు సత్యసాయి
జయంతి సందర్భంగా పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శనివారం కూడా కొన్ని సేవా కార్యక్రమాలు జరిగాయి. – శ్రీకాకుళం కల్చరల్
శ్రీకాకుళం న్యూకాలనీ సత్యసాయి సమితి ఆధ్వర్యంలో 100 కిలోల కేక్‌ను కటింగ్..
పెద్దమందిరంలో కేక్ కట్‌చేసేందుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కలెక్ట ర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరవుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు తెలిపా రు. నారాయణ సేవలో భాగంగా 60మందికి క్యా రేజీల పంపిణీ, మహాప్రసాద వితరణ, సినీ గా యని అయాన్ ప్రణతి చే ‘భక్తి సంగీత విభావరి, ఝాలా ఉత్సవంతో ముగుస్తుందని తెలిపారు.
న్యూకాలనీలోనూ నారాయణ సేవ కింద 120 మందికి క్యారేజీలు పంపిణీ చేస్తున్నారు.
పీఎన్‌కాలని సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో కూడా ప్రభాత నగర సంకీర్తన, మహా ప్రసాద వితరణ, బుడుమూరు లక్ష్మీప్రసాదరావు దంపతుల సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తారు. ప్రముఖ వైద్యులు అన్నెపు శశిధర్ ఆధ్వర్యంలో జరిగే వైద్యశిబిరానికి ముఖ్య అతి థిగా డాక్టర్ సీపాన గోపి హాజరు కానున్నారు.
హౌసింగ్ బోర్డు కాలనీలోని సత్యం శివం సుందరం మందిరంలోనూ మహాప్రసాద వితరణ, భక్తి సంగీత విభావరి ఊయల ఉత్సవం, బాలవికాస్ పిల్లలతో కేక్ కటింగ్ జరుగుతాయి.
జెడ్పీ ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ లోని సాయి మందిరంలో మహానగర సంకీర్తన, కేక్ కటింగ్, సత్యసాయి లక్షార్చన, మహా ప్రసా ద వితరణ, సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శన, ఊయల ఉత్సవం జరుగుతాయి.
కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న సాయి గణేష్ మందిరంలో జ్ఞాన యజ్ఞం, మహానారాయణ సేవ, ఆధ్యాత్మిక ప్రసంగం, కేక్ సమర్పణ, ఝాలా ఉత్సవం జరుగుతాయి.
శత వత్సరం.. సేవా సమాహారం
శత వత్సరం.. సేవా సమాహారం
శత వత్సరం.. సేవా సమాహారం
శత వత్సరం.. సేవా సమాహారం
శత వత్సరం.. సేవా సమాహారం


