సాక్షి,అమరావతి: పల్నాడు జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. రెంటచింతల మండలంలో బయోడీజిల్ బంక్‌లో పేలుడు సంభవించింది. బయోడీజిల్ అన్‌లోడ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుంది. ఫైరింజన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తోంది. గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదంలో మరణించిన వ్యక్తి గురజాలకు చెందిన రషీద్‌గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.


